Listen to this article

జనంన్యూస్. 17.నిజామాబాదు.శ్రీనివాస్ పటేల్.

నిజామాబాదు నగరంలోని వినాయక్ నగర్‌లో బసవ గార్డెన్‌లో సోమవారం సాయంత్రం అమెచ్యూర్ టైక్వాండో అసోసియేషన్ ప్రధాన కార్యదర్శి మనోజ్ కుమార్ ఆధ్వర్యంలో కలర్ బెల్ట్ ప్రమోషన్ మరియు బెల్ట్ అవార్డింగ్ కార్యక్రమం ఘనంగా నిర్వహించబడింది.ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా అదనపు జిల్లా & సెషన్స్ జడ్జి దుర్గాప్రసాద్ హాజరయ్యారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ, టైక్వాండో వంటి క్రీడలు నేర్చుకోవడం వల్ల పిల్లల్లో క్రమశిక్షణ (discipline), మంచి వ్యక్తిత్వం (character) పెరుగుతాయని, శారీరకంగా మరియు మానసికంగా దృఢంగా తయారవుతారని తెలిపారు. చదువుల్లో కూడా వారు ముందుంటారని అన్నారు.పిల్లలను క్రమం తప్పకుండా శిక్షణకు పంపిస్తున్న తల్లిదండ్రులను ప్రత్యేకంగా అభినందించారు. విద్యార్థులందరూ జాతీయ మరియు అంతర్జాతీయ స్థాయిలో మెడల్స్ సాధించాలని ఆకాంక్షించారు.ఈ సందర్భంగా కోచ్ మనోజ్ కుమార్‌ను ప్రత్యేకంగా అభినందించారు.ఈ కార్యక్రమంలో తైక్వాండో అధ్యక్షుడు బస్వ లక్ష్మీ నర్సయ్య.బ్లాక్ బెల్ట్ సభ్యులు గంగాధర్, నాగరాజ్, నాగరాణి, సిద్ధార్థ, గోపీకృష్ణ, సుమిత్, సాయిరామ్ మరియు తల్లిదండ్రులు పాల్గొన్నారు.