Listen to this article

జనం న్యూస్ మార్చి 18 తెలంగాణ స్టేట్ ఇంచార్జ్ శ్రీనివాస్ రెడ్డి

రాష్ట్రంలోని ముస్లిం మైనార్టీల సమగ్ర అభివృద్ధికి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నాయకత్వంలోని తెలంగాణ ప్రభుత్వం కృతనిశ్చయంతో పనిచేస్తోందని టీపీసీసీ ఉపాధ్యక్షుడు, కూకట్‌పల్లి కాంగ్రెస్ పార్టీ ఇంచార్జ్ బండి రమేష్ స్పష్టం చేశారు. రంజాన్ పర్వదినాన్ని పురస్కరించుకుని ప్రభుత్వం ఏర్పాటు చేసిన ‘ఈద్ ముబారక్’ కిట్ల పంపిణీ కార్యక్రమంలో భాగంగా బుధవారం బేగంపేట ప్రకాష్ నగర్‌లోని ముస్లిం మహిళలకు ఆయన స్వయంగా కిట్లను అందజేశారు.ఈ సందర్భంగా ముస్లిం సోదరసోదరీమణులకు రంజాన్ శుభాకాంక్షలు తెలియజేసిన రమేష్, పవిత్రమైన ఈ మాసాన్ని శాంతి, సామరస్య వాతావరణంలో జరుపుకోవాలని ఆకాంక్షించారు. మైనార్టీల సంక్షేమం కోసం ప్రభుత్వం ప్రవేశపెట్టిన పలు పథకాలను సద్వినియోగం చేసుకుని ఆర్థికంగా మరింత బలపడాలని సూచించారు.ప్రభుత్వం తీసుకొస్తున్న సంక్షేమ చర్యలు ముస్లింల జీవనోపాధికి తోడ్పడుతున్నాయని పేర్కొన్న ఆయన, భవిష్యత్తులో మరిన్ని అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉందన్నారు.ఈ కార్యక్రమంలో లక్ష్మయ్య, పర్వేజ్, నరేష్, అలీ, రమాదేవి, తోచర్, జాన్, సుజిత్ గౌడ్, అరుణ్, ఆసిఫ్ తదితరులు పాల్గొన్నారు.