Listen to this article

జనం న్యూస్ 18 మార్చి వికారాబాద్ జిల్లా

పూడూరు మండలం నిజాంపేట్ మేడిపల్లి లో రాత్రి ఈదురుగాలులు, ఉరుములు, మెరుపులతో కూడిన భారీ వడగండ్ల వర్షానికి 217 మేకలు మృతి చెందాయి. అధికారులు సంఘటన స్థలాన్ని పరిశీలించి వివరాలు సేకరిస్తున్నారు. ఎమ్మార్వో ‌పశువైద్య డాక్టర్లు వచ్చి పంచనామా చేశారు. వివరాలలోకి వెలితే..వికారాబాద్ జిల్లా చౌడపూర్ మండలం కొత్తపల్లి గ్రామానికి చెందిన కొందరు రైతులు మేకలు మేపడానికి వలస వెళ్తుంటారు. ప్రతి సంవత్సరం లాగే నిజాంపేట్ మేడిపల్లి గ్రామ సమీపంలో జైపాల్ రెడ్డి పొలంలో మేకల మంద వేశారు. అర్ధరాత్రి వడగండ్ల వాన కురిసి మేకులు చనిపోయాయి. మేకలు చనిపోయిన వారి వివరాలు..ఈప్పపల్లి కేశవులు 70, కమరం యాదయ్య 45, నక్కపోతు రామచంద్రయ్య 31, గోరెంకా గోపాల్ 08, పల్లెముని కేశవులు 40, జంబుల యాదయ్య 19, జరుపుల బన్ని 04, మొత్తం 217 మేకలు చనిపోయాయి. మేకలు చనిపోవడంతో తమ జీవనాధారం కోల్పోయామని, ప్రభుత్వం తమని ఆదుకోవాలని కాపరులు కోరుతున్నారు.