Listen to this article

జనం న్యూస్, మార్చ్ 18, జగిత్యాల జిల్లా

మెట్ పల్లి: పట్టణంలోని 15వ కౌన్సిలర్ అయిన అరిగెల అనూష రాకేష్ వాడు అభివృద్ధి కొరకై కృషి చేస్తున్నారు, వార్డులోని పతి గల్లీలో పర్యవేక్షిస్తూ ప్రజల నుంచి సమస్యలను తెలుసుకుంటూ పరిష్కార దిశగా అడుగులు వేస్తున్నారు, వార్డులో ప్రతి గల్లీ లోని పారిశుధ్య పనులను కౌన్సిలర్ అరిగెల అనూష–రాకేష్ పర్యవేక్షించారు. వార్డులో పరిశుభ్రత మెరుగుపరిచేందుకు చేపడుతున్న పనులను పరిశీలించి, మున్సిపాల్ సిబ్బందికి అవసరమైన సూచనలు ఇచ్చారు. పారిశుధ్యం వల్ల వార్డులోని ప్రజలకు ఎలాంటి అనారోగ్య సమస్యలు వాటిల్లాకూడాదని పారిశుద్ధ సిబ్బందితో చెప్పారు, చెత్త తొలగింపు, కాలువల శుభ్రత పనులు నిరంతరం కొనసాగించాలని ఆదేశించారు. ప్రజలు కూడా పరిశుభ్రతపై బాధ్యతగా వ్యవహరించి పరిసరాలను శుభ్రంగా ఉంచాలని తెలిపారు