జనంన్యూస్. 18.సిరికొండ.శ్రీనివాస్ పటేల్.
నిజామాబాదు రురల్ సిరికొండ మండల కేంద్రంలో గల పీ యం శ్రీ తెలంగాణ ఆదర్శ పాఠశాల&కళాశాలలో ఘనంగా ఈరోజు స్కౌట్స్ అండ్ గైడ్స్ విభాగం ఆధ్వర్యంలో పతాకావిష్కరణ కార్యక్రమం అత్యంత ఉత్సాహభరితంగా నిర్వహించబడింది.ప్రిన్సిపాల్ ఆధ్వర్యంలో స్కౌట్ మాస్టర్ మరియు గైడ్ కెప్టెన్ మిగిత ఉపాధ్యాయ బృందం సమక్షంలో విద్యార్థిని పారిపెల్లి శ్రీనిత చే స్కౌట్స్ అండ్ గైడ్స్ పతాకాన్ని ఆవిష్కరించి వందనం సమర్పించారు.అనంతరం ప్రిన్సిపాల్ గడ్డం రాజేష్ రెడ్డి విద్యార్థులను ఉద్దేశించి మాట్లాడుతూ.. “విద్యార్థి దశ నుంచే క్రమశి క్షణ, సేవాభావం మరియు దేశభక్తిని పెంపొందించుకోవడంలో స్కౌట్స్ అండ్ గైడ్స్ పాత్ర అమోఘమైనది. ఇది కేవలం ఒక విభాగం మాత్రమే కాదు,విద్యార్థులను బాధ్యతాయుతమైన పౌరులుగా తీర్చిదిద్దే ఒక గొప్ప వేదిక” అని పేర్కొన్నారు.కష్టకాలంలో ఇతరులకు సహాయం చేయడం,నాయకత్వ లక్షణాలను అలవర్చుకోవడం మరియు సామాజిక స్పృహ కలిగి ఉండటం స్కౌట్స్ అండ్ గైడ్స్ యొక్క ముఖ్య ఉద్దేశమని ఆయన వివరించారు.అనంతరం విద్యార్థులందరూ క్రమశిక్షణతో కూడిన పరేడ్ నిర్వహించి,సమాజ సేవకు కట్టుబడి ఉంటామని,సత్ప్రవర్తనతో మెలగుతామని సమిష్టిగా ప్రతిజ్ఞ (Pledge) చేశారు. ఈ సందర్భంగా విద్యార్థులు ప్రదర్శించిన క్రమశిక్షణ అందరినీ ఆకట్టుకుంది.
ఈ కార్యక్రమంలో ప్రిన్సిపాల్ గడ్డం రాజేష్ రెడ్డి.పాఠశాల స్కౌట్ మాస్టర్ పీడి నక్క కిషన్.గైడ్ కెప్టెన్ విక్కిరి అనీల.ఉపాధ్యాయ బృందం మరియు విద్యార్థులు పాల్గొన్నారు.



