

మధిర టౌన్ ఫిబ్రవరి 12 జనం న్యూస్ ప్రతినిధి ఎన్ సుందర్ రావు బ్రోచర్ ఆవిష్కరించిన కళాపరిషత్ అధ్యక్షులు… పుతుంబాక కృష్ణ ప్రసాద్ మాటురుపేట గ్రామ వాస్తవ్యులు గడ్డం సుబ్బారావు అధ్యక్షత వహిస్తున్న శ్రీ సీతారామాంజనేయ కళాపరిషత్ ఆధ్వర్యంలో మార్చి నెలలోని 21,22,23 తేదీలలో రెండు తెలుగు రాష్ట్రాల పౌరాణిక నాటక సన్నివేశాలను, ఏకపాత్రాభినయ పోటీలను నిర్వహిస్తున్నట్లు కళాపరిషత్ నిర్వాహకులు తెలిపారు. బుధవారం గ్రామంలోని శ్రీ సీతారామచంద్ర స్వామి వారి దేవాలయంలో ప్రత్యేక పూజలు అనంతరం కళాపరిషత్తు అధ్యక్షులుఉమ్మడి ఆంధ్ర రాష్ట్ర పోలీస్ గృహ నిర్మాణ సంస్థ మాజీ చైర్మన్ పుతుంబాక కృష్ణ ప్రసాద్ చేతుల మీదగా బ్రోచర్ ఆవిష్కరించడం జరిగింది.రెండు తెలుగు రాష్ట్రాల కళాకారులు పెద్ద సంఖ్యలో పాల్గొని ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు.ఈ బ్రోచర్ ఆవిష్కరణలో రాయల కోటయ్య, గుర్రాల కృష్ణారెడ్డి,మాదాల రామారావు, అన్నం కృష్ణమూర్తి, పోతినేని నరసింహారావు, పిచ్చయ్య, రావూరి రామారావు, గండ్ర నర్సయ్య, సామినేని శ్రీనివాసరావు, చిలువేరు శాంతయ్య, సంక్రాంతి వీరయ్య, గడ్డం శ్రీహరి కృష్ణ, కొర్లగంటి మాధవరావు,