Listen to this article

జనం న్యూస్ , 10 జనవరి , ఇల్లంతకుంట : ఇల్లంతకుంట మండల కేంద్రంలోని వాణి నికేతన్ హైస్కూల్లో ముందస్తు సంక్రాంతి సంబరాలు ఘనంగా జరిగాయి. పాఠశాల ఆవరణలో భోగి మంటలు వేశారు. విద్యార్థినిలకు ముగ్గుల పోటీలు నిర్వహించి బహుమతులు అందజేశారు. ఈ సందర్భంగా పాఠశాల కరస్పాండెంట్ తూముకుంట్ల శ్రీనివాస్ రెడ్డి మాట్లాడుతూ సంక్రాంతి అంటేనే నూతన క్రాంతి అని, మూడు రోజులపాటు జరుపుకునే పండుగ అన్నారు. రైతులు తాము పండించిన ధాన్యం ఇళ్లకు చేరుతుందని పేర్కొన్నారు. ప్రతి ఇంటి ముందు రంగవల్లులు వేసి జరుపుకునే గొప్ప పండుగ సంక్రాంతి అన్నారు. కార్యక్రమంలో ప్రిన్సిపల్ తూముకుంట శ్రీనిధి, ఉపాధ్యాయులు శ్రీనివాస్, సంతోష్, రాజు, రమేష్, తిరుపతి, రాజు, శోభ, సుమంగళి, కళ్యాణి, రేఖ, లావణ్య, సునంద, ఉష, రేణుక, జలజ, మౌనిక, స్వాతి, శాంత, పద్మ, షమీమా, మహాలక్ష్మి లతోపాటు విద్యార్థులు పాల్గొన్నారు.