డిగ్రీ కళాశాలలో ఉగాది వేడుకలు.
బిచ్కుంద మార్చ్ 18 జనం న్యూస్
కామారెడ్డి జిల్లా జుక్కల్ నియోజకవర్గం బిచ్కుంద మండల కేంద్రంలో ని ప్రభుత్వ డిగ్రీ కళాశాల (స్వయంప్రతిపత్తి) బిచ్కుంద లో తెలుగు విభాగం వారి ఆధ్వర్యంలో ఉగాది వేడుకలను ఘనంగా నిర్వహించారు. విద్యార్థులు కళాశాల ప్రాంగణమంతా అరటి కొబ్బరి మామిడి తోరణాలతో చక్కగా అలంకరించారు . విద్యార్థులు సంప్రదాయ దుస్తులు ధరించి కవి సమ్మేళనంలో పాల్గొని ఉపన్యసించారు. కళాశాల ప్రిన్సిపాల్ కె . అశోక్ మాట్లాడుతూ తెలుగు సాంప్రదాయాలను నేటి యువతరం తెలుసుకోవాల్సిన ఆవశ్యకత ఉందని విద్యార్థులకు సూచించారు. పచ్చడి తయారీ కవి సమ్మేళనం, పంచాంగ శ్రవణం ఏర్పాటు చేసినందుకు తెలుగు విభాగం అధ్యాపకులను అభినందించారు. ఈ కార్యక్రమానికి స్థానిక యువకవి ఫత్లాపూర్( Z P H S )జెడ్ పి హెచ్ ఎస్ తెలుగు ఉపాధ్యాయుడు డి. క్రాంతి కుమార్ ఉగాది పండగ విశిష్టతను ప్రాముఖ్యతను మరియు కవితలు రాసిన విద్యార్థులకు అభినందనలు తెలిపి తగు సూచనలు చేశారు. ఎంఏ తెలుగు మొదటి సంవత్సర విద్యార్థి వెంకటకృష్ణ శర్మ జోషి పంచాంగ శ్రవణంతో వేడుకను మరింత శోభన తెచ్చారు . కవిత పఠనం,ఉపన్యాసాలు గెలుపొందిన విద్యార్థులకు జ్ఞాపిక మరియు ప్రశంసా పత్రం ఇవ్వడం జరిగింది.ఈ కార్యక్రమంలో కళాశాల అధ్యాపకులు పాల్గొన్నారు.విద్యార్థిని విద్యార్థులు ఉత్సాహంగా పాల్గొని కొత్త అనుభూతిని పొందారు .




