జనం న్యూస్ 20 మార్చి శాయంపేట మండలం రిపోర్టర్ మామిడి రవి శాయంపేట
మండలంలోని కేంద్రంలో ని అతి పురాతన మైన ఆరు శతాబ్దాల చరిత్ర కలిగిన శ్రీ మత్స్యగిరి స్వామి దేవాలయంలో ఉగాది పర్వదినాన్ని పురస్కరించుకుని గురువారం సాయంత్రం అర్చకులు ఆరుట్ల కృష్ణమాచారి పంచాంగ శ్రవణం నిర్వహించినారు. ఈ సంవత్సరం గురువు రాజు అగుట వలన అంగారకుడు మంత్రి అగుటవలన వర్షాలు బాగా పడి పంటలు బాగా పండుతాయని ఆదాయo ఖర్చుల గురించి తెలియజేసినారు. ఉగాది విశిష్టత గురించి జిల్లా నర్మదా వివరించినారు ఈ కార్యక్రమంలో దేవాలయ చైర్మన్ సామల బిక్షపతి అడ్వకేట్స్ గట్ల విజయపాల్ రెడ్డి లెక్కల జలంధర్ రెడ్డి జిన్న ప్రతాప్ సేన రెడ్డి వినుకొండ శంకరాచారి సామల రవీందర్ నల్లెల్ల విజేందర్ వనం దేవరాజు గిద్దమరి సురేష్ కానుగుల నాగరాజు కడారి చంద్రమౌళి భక్తులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు


