జనం న్యూస్ | మార్చి 20 | తెలంగాణ స్టేట్ ఇంచార్జ్: శ్రీనివాస్ రెడ్డి
తెలుగు ప్రజల నూతన సంవత్సర పర్వదినమైన ఉగాది సందర్భంగా కూకట్పల్లి ప్రాంతంలో స్నేహపూర్వక వాతావరణంలో శుభాకాంక్షల మార్పిడి కార్యక్రమం జరిగింది. రామకృష్ణ వెల్ఫేర్ అసోసియేషన్ అధ్యక్షుడు జనంపల్లి పురంధర్ రెడ్డి స్థానిక పోలీస్ అధికారులను మర్యాదపూర్వకంగా కలిసి ఉగాది శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా కూకట్పల్లి సర్కిల్ ఇన్‌స్పెక్టర్ వెంకట సుబ్బారావును కలిసి శాలువాతో సన్మానం చేసి, మిఠాయిలు పంచిపెట్టి పండుగ ఆనందాన్ని పంచుకున్నారు. అనంతరం ఎస్సైలు రామకృష్ణ, చంద్రశేఖర్, దీక్షిత, శ్రీను బాబు, క్రైమ్ ఎస్సై రవీందర్ రెడ్డి తదితరులను కలిసి వారిని కూడా శాలువాలతో సత్కరించి ఉగాది శుభాకాంక్షలు తెలిపారు.ఈ సందర్భంగా పురంధర్ రెడ్డి మాట్లాడుతూ, కూకట్పల్లి పోలీస్ అధికారులు ప్రజలకు ఎల్లప్పుడూ అందుబాటులో ఉంటూ కంటికి రెప్పలా కాపాడుతున్నారని కొనియాడారు. ప్రజల సమస్యలను వేగంగా పరిష్కరించడంలో వారు చూపుతున్న చురుకుదనం ప్రశంసనీయమని పేర్కొన్నారు. ప్రజా భద్రత పరిరక్షణలో వారి సేవలు ఆదర్శప్రాయమని అన్నారు.ఈ కార్యక్రమంలో అసోసియేషన్ కమిటీ సభ్యులు జి. ప్రసాద్, పురుషోత్తం, సూర్యనారాయణ, నాని, శ్రీధర్ రావు తదితరులు పాల్గొని పోలీస్ అధికారులను అభినందించారు.అదేవిధంగా వివేకానంద నగర్ డివిజన్ ప్రజలకు, కాలనీవాసులకు, నాయకులకు, అధికారులకు, ముఖ్యంగా పత్రికా మరియు ఎలక్ట్రానిక్ మీడియా ప్రతినిధులకు ఉగాది శుభాకాంక్షలు తెలియజేస్తూ, ప్రతి ఒక్కరికీ పేరుపేరునా పురంధర్ రెడ్డి ప్రత్యేక అభినందనలు తెలిపారు.



