

జనం న్యూస్, రణస్థలం, తేది : 12-02-25, బుధవారం. రిపోర్టర్ : పొట్నూరు రామునాయుడు. కేంద్ర రోడ్డు రవాణా మరియు రహదారుల మంత్రిత్వ శాఖ మంత్రి నితిన్ గడ్కారీ ని ,దగ్గుబాటి పురంధేశ్వరితో కలిసి మర్యాద పూర్వకంగా నియోజకవర్గం లో అవసరమైన రహదార్ల నిర్మాణానికి నిధులు కేటాయించాలని కోరుతూ ఈ రోజు న్యూఢిల్లీ లో ఆయన ఛాంబర్ లో కలిసి విజ్ఞప్తి చేసిన ఎచ్చెర్ల ఎమ్మెల్యే నడుకుదిటి ఈశ్వరరావు. ఎమ్మెల్యే గా గెలిచినందుకు అభినందనలు తెలియజేస్తూ, నా వంతు సహకారం అందిస్తానని,నిత్యం ప్రజల్లో ఉంటూ సర్వీస్ అందించి పార్టీకి, ప్రభుత్వానికి మంచి పేరు తీసుకుని రావాలని కేంద్ర మంత్రి గడ్కారీ సూచించారు.