Listen to this article

జనం న్యూస్:20 మార్చ్ శుక్రవారం; సిద్దిపేట నియోజికవర్గ ఇన్చార్జి వై రమేష్;

తెలంగాణ రాష్ట్ర శాసనమండలి ప్రభుత్వ విప్‌గా నియమితులైన డా. బలమూరి వెంకట్ నీ మర్యాదపూర్వకంగా కలిసి శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ సందర్భంగా ఈ నెల 22వ తేదీన నర్మెట్టలో నిర్వహించనున్న పామ్ ఆయిల్ ఫ్యాక్టరీ ప్రారంభోత్సవ కార్యక్రమంపై చర్చించారు. ఈ కార్యక్రమానికి తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి అనుముల రేవంత్ రెడ్డి ముఖ్య అతిథిగా హాజరుకానున్నారు.
ఈ సమావేశంలో కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర నాయకులు దాసరి రాజు, సిద్దిపేట యువజన కాంగ్రెస్ జిల్లా జనరల్ సెక్రటరీ కొండలవాడి సతీష్, రాజు భరత్ తదితరులు పాల్గొన్నారు.