కష్టకాలంలో… జనసేన యోధుడు గోపికి ధైర్యం చెప్పిన రాంకీ మరియు కొణతాల.
జనం న్యూస్ మార్చ్ 20 అనకాపల్లి జిల్లా రిపోర్టర్ కృష్ణ
జనసేన పార్టీ… కార్యకర్తల సంక్షేమమే ధ్యేయంగా, కష్టకాలంలో వారికి అండగా ఉంటామని యువ నాయకులు భీమరశెట్టి రాంకీ చాటి చెప్పారు. ఇటీవల రోడ్డు ప్రమాదంలో కాలుకు తీవ్ర గాయమై కోలుకుంటున్న కొప్పాక గ్రామానికి చెందిన జనసేన నాయకుడు ఈత గోపిని రాంకీ మర్యాద పూర్వ కంగా పరామర్శించారు.ఈ మేరకు శుక్ర వారం కొప్పాకలోని గోపి నివాసానికి వెళ్లిన రాంకీ, ఆయన ఆరోగ్య పరిస్థితిని అడిగి తెలుసుకున్నారు. ధైర్యంగా ఉండాలని, పార్టీ ఎల్లప్పుడూ అండగా ఉంటుందని భరోసా ఇచ్చారు. గాయం నుంచి త్వరగా కోలుకుని తిరిగి ప్రజా సేవలో చురుగ్గా పాల్గొనాలని ఆకాంక్షిం చారు. ఫోన్ ద్వారా పరామర్శించిన కొణతాల రామకృష్ణ.ఈ సందర్భంగా మాజీ మంత్రి, ఎమ్మెల్యే కొణతాల రామకృష్ణ ఫోన్ ద్వారా ఈత గోపితో మాట్లాడారు. ప్రమాదం జరిగిన తీరును, ప్రస్తుతం అందుతున్న వైద్య సహాయం గురించి అడిగి తెలుసుకున్నారు. మెరుగైన వైద్యం కోసం ఏ అవసరం ఉన్నా తమ దృష్టికి తీసుకురావాలని గోపికి ధైర్యం చెప్పారు.తమ కష్ట కాలంలో నాయకులు స్వయంగా ఇంటికి వచ్చి పరామర్శించడం, పెద్దలు ఫోన్ చేసి ధైర్యం చెప్పడంపై గోపి మరియు ఆయన కుటుంబ సభ్యులు కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో జీవీఎంసీ 84 వ వార్డ్ జనసేన పార్టీ ఇంచార్జ్ చేబ్రోలు దుర్గాప్రసాద్ తో పాటు స్థానిక జనసేన నాయకులు బత్తిన జగదీష్, పొలిమేర బాలాజీ, గిరీష్, రాజా మరియు కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.


