Listen to this article

మానవ హక్కుల వేదిక రాష్ట్ర కార్యదర్శి డాక్టర్ ఎస్ తిరుపతయ్య..

జనం న్యూస్ //ఫిబ్రవరి 12//జమ్మికుంట //కుమార్ యాదవ్.. ఆలయ అర్చకుడు రంగరాజన్‌పై జరిగిన దాడి విచారకరం,అన్నారు. మానవ హక్కుల వేదిక రాష్ట్ర కార్యదర్శి డా.. తిరుపతియ్య,.. ఈ సందర్భంగా మాట్లాడుతూ..రాజ్యాంగ పరంగా ఆలయాన్ని నిర్వహిస్తున్న ఓ పూజారిపై భౌతిక దాడి చేయడం అత్యంత హేయమైన చర్య,అన్నారు.ఇది మతోన్మాద సంస్కృతికి సంకేతంగా మారిందని మేము ఖండిస్తున్నాం, అని తెలిపారు. తమను శ్రీరాముని వంశానికి చెందినవారని చెప్పుకున్న కొందరు వ్యక్తులు, రామరాజ్యం స్థాపన కోసం ఆర్థిక సహాయం చేయాలని, వారి శ్రీరామ సైన్యంలోకి ఇక్ష్వాకు వంశస్తులను రిక్రూట్ చేయాలని రంగరాజన్‌ను డిమాండ్ చేశారు. అయితే, ఆయన నిరాకరించడంతో భౌతిక దాడికి పాల్పడ్డారు. ఇది రాజ్యాంగ విరుద్ధ చర్య. ఇలాంటి ఘటనలు సమాజంలో మత విద్వేషాన్ని రెచ్చగొట్టేలా మారుతున్నాయి, అని వేదిక నాయకులు ఆగ్రహం వ్యక్తం చేశారు.ప్రభుత్వం తక్షణ చర్యలు తీసుకోవాలని డిమాండ్,చేసారు. ఈ ఘటనపై ప్రభుత్వాము వెంటనే స్పందించాలని కోరుతున్నాం, అన్నారు.దాడికి పాల్పడ్డవారిని కఠినంగా శిక్షించాలాని, అంతేకాకుండా , ఇలాంటి సంఘటనలు పునరావృతం కాకుండా హిందూ ధర్మం పేరుతో రాజ్యాంగ స్పూర్తికి విరుద్ధంగా పనిచేసే సంస్థలను నియంత్రించాల్సిన అవసరం ఉంది, అని వివరించారు.మత సామరస్యాన్ని దెబ్బతీసే వ్యక్తులపై ప్రత్యేక చట్టాలు రూపొందించి కట్టడి చేయాలని మేము ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నమని,మానవ హక్కుల వేదిక రాష్ట్ర కార్యదర్శి డా. ఎస్. తిరుపతయ్య పేర్కొన్నారు.