Listen to this article

జనం న్యూస్, మార్చ్ 20, జగిత్యాల జిల్లా, మెట్ పల్లి :

పట్టణంలో గల 15 వ వార్డులో బోర్ సౌకర్యం ఉన్నప్పటికీ మోటార్ సదుపాయం లేకపోవడం వల్ల 11 సంవత్సరాలుగా వాడుకలో లేని బోరుకు నూతనంగా గెలుపొందిన 15వ వార్డు కౌన్సిలర్ అరిగెల అనూష-రాకేష్ ఎన్నికల హమీలో భాగంగా ఇచ్చిన మాట ప్రకారం నిరుపయోగంగా ఉన్న బోరు బావికి కొత్త మోటారు, పైపులు బిగించి ప్రజలు వినియోగించుకునేలా చేసి తమ హమీని నెరవేర్చారు ఇట్టి మోటారును మున్సిపల్ ఛైర్మెన్ మైలారపు లింబాద్రి, వైస్ చైర్మన్ ఓంకార్ నవీన్ చేతుల మీదుగా 15వ వార్డు కౌన్సిలర్ అరిగెల అనూష-రాకేష్ ప్రారంభించడం జరిగింది. ఈ సందర్భంగా వార్డు కౌన్సిలర్ అరిగెల అనూష-రాకేష్ మాట్లాడుతూ ఎన్నికల్లో ఇచ్చిన హమీ ప్రకారం బోరుకు మోటారు బిగించి మాట నిలబెట్టుకున్నామని, భవిష్యత్తులో కూడా తాము ఇచ్చిన హామీలను నెలబెట్టుకుంటూ వార్డు అభివృద్ధికి కట్టుబడి ఉంటామని వార్డు ప్రజలకు తెలియజేశారు.ఇచ్చిన హామీ నిలబెట్టుకున్నందుకు వార్డు కౌన్సిలర్ అనూష-రాకేశ్ ని వార్డు ప్రజలు ఘనంగా సన్మానించారు.. ఈ కార్యక్రమంలో వార్డు కౌన్సిలర్ అరిగెల అనూష-రాకేష్ తో పాటు మున్సిపల్ చైర్మన్ మైలారపు లింబాద్రి, వైస్ చైర్మన్ ఓంకార్ నవీన్, 11వ వార్డు కౌన్సిలర్ రెబ్బస్ మహేష్ తదితరులు పాల్గొన్నారు..