జనం న్యూస్ ; 20 మార్చ్ శుక్రవారం; సిద్దిపేట నియోజికవర్గ ఇన్చార్జి వై. రమేష్:
కథలు చెప్పడం ఒక కళ అని, కథల ద్వారా వివిధ పాఠశాలల్లో బాలలకు నిత్య చైతన్యం తెస్తున్న కథల తాతయ్య ఎన్నవెల్లి రాజమౌళికి అంతర్జాతీయ కథలు చెప్పే దినోత్సవం సందర్భంగా సిద్దిపేట కవులు ఉండ్రాళ్ళ రాజేశం, వరుకోలు లక్ష్మయ్య, బస్వ రాజ్ కుమార్, మిట్టపల్లి పరుశరాములు, అనిశెట్టి సతీష్ కుమార్, గంగాపురం శ్రీనివాస్ లు సత్కారం చేశారు. సమాజంలో చెప్పే ముచ్చట్లు అన్ని వింతగా అనిపించినప్పుడు ఏం కథ చెబుతున్నావు అన్నట్లుగా ఒక కొత్తతనాన్ని తెచ్చే, ప్రతి ముచ్చట కథగా మారుతుందన్నారు.


