Listen to this article

జనం న్యూస్ 21 మార్చి వికారాబాద్ జిల్లా.

క్రమశిక్షణ, దానగుణం, మరియు సహనానికి ప్రతీకగా నిలిచే పవిత్ర రంజాన్ (ఈద్-ఉల్-ఫితర్) పండుగను పురస్కరించుకుని వికారాబాద్ జిల్లాలోని ముస్లిం సోదరులందరికీ, వారి కుటుంబ సభ్యులకు జిల్లా ఎస్పీ స్నేహ మెహ్ర, ఐపిఎస్ హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేశారు. నెల రోజుల పాటు అత్యంత నిష్ఠతో ఉపవాస దీక్షలు విరమించి జరుపుకునే ఈ వేడుక, జిల్లా ప్రజలందరి జీవితాల్లో సుఖశాంతులు, ఆయురారోగ్యాలు మరియు సమృద్ధిని నింపాలని ఎస్పీ ఆకాంక్షించారు. ఈ పండుగ సమాజంలో మత సామరస్యాన్ని, సోదరభావాన్ని మరింత పటిష్టం చేయాలని ఆమె కోరారు. ఈ సందర్భంగా శాంతిభద్రతల పరిరక్షణ కోసం పోలీసు శాఖ అన్ని ఏర్పాట్లు చేసిందని, ఎక్కడా ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ప్రశాంతమైన వాతావరణం లో జిల్లా లో పండుగలు చేసుకోవాలని ఎస్పీ తెలియజేయడం జరిగింది.