జనం న్యూస్ 21 మార్చి 2026 జిల్లా బ్యూరో ఇన్చార్జి జోగులాంబ గద్వాల్ జిల్లా విష్ణు వర్ధన్ గౌడ్: బడ్జెట్ కేటాయింపులలో విద్యారంగాన్ని, నిరుద్యోగులను విస్మరించిన రేవంత్ రెడ్డి సర్కార్.విద్యార్థులకు నిరుద్యోగులకు తీవ్రమైన అన్యాయం. బీఆర్ఎస్వి రాష్ట్ర నాయకులు మరియు జోగులాంబ గద్వాల జిల్లా కోఆర్డినేటర్ కురువ పల్లయ్య ఊసేలేని జాబ్ క్యాలెండర్, నిరుద్యోగ భృతి.హామీలు గొప్పగా… అమలు సున్నా.ఈ సందర్భంగా గద్వాల జిల్లా కేంద్రంలో బీఆర్ఎస్వి రాష్ట్ర నాయకులు కురువ పల్లయ్య మాట్లాడుతూ…3.24 లక్షల కోట్ల బడ్జెట్లో విద్యకు కేవలం 8.22% మాత్రమే.తెలంగాణ రాష్ట్ర బడ్జెట్లో విద్యారంగానికి కాంగ్రెస్ ప్రభుత్వం మరోసారి మొండి చెయ్యి చూపించింది. ₹3,24,234 కోట్ల భారీ రాష్ట్ర బడ్జెట్లో విద్యారంగానికి కేటాయించిన నిధులు కేవలం ₹26,674 కోట్లే. అంటే మొత్తం బడ్జెట్లో సుమారు 8.22% మాత్రమే. 2025–26 ఆర్థిక సంవత్సరంలో 7.6% కేటాయించగా, 2026–27లో అది కేవలం 8.22%కు మాత్రమే.ప్రభుత్వం విద్యారంగంపై చూపుతున్న నిర్లక్ష్యానికి నిదర్శనం.ఎన్నికల సమయంలో కాంగ్రెస్ పార్టీ తన మేనిఫెస్టోలో విద్యారంగానికి 15% నిధులు కేటాయిస్తామని ఘనంగా హామీ ఇచ్చినా, ఆ హామీని మళ్లీ విస్మరించింది.హామీలు ఇచ్చి గాలికి వదిలేసిన ప్రభుత్వం విద్యార్థుల నమ్మకాన్ని ద్రోహం చేసింది. దేశంలోని నాగాలాండ్, త్రిపుర వంటి రాష్ట్రాలు విద్యకు సుమారు 20% వరకు నిధులు కేటాయిస్తూ ముందంజలో ఉంటే, “ప్రజా ప్రభుత్వం, విద్యార్థి ప్రభుత్వం” అని చెప్పుకునే తెలంగాణ ప్రభుత్వం మాత్రం విద్యారంగానికి తగిన ప్రాధాన్యత ఇవ్వకపోవడం ఆందోళనకరం.రాష్ట్ర భవిష్యత్తు విద్యపై ఆధారపడి ఉంటుంది. అలాంటి కీలక రంగాన్ని నిర్లక్ష్యం చేయడం అనేది విద్యార్థుల భవిష్యత్తుతో ఆటలాడటమే. అదేవిధంగా గురుకులల ఊసే లేదు. తులం బంగారం మోసం.. మోసం!నిరుద్యోగులకు రెండు లక్షల ఉద్యోగాలు మోసం.. మోసం మహిళలకు రూ. 2,500 మోసం.. మోసం!వృద్ధులకు రూ. 4,000 ఫించన్ మోసం.. మోసం!6 నెలల్లో పీఆర్సీ మోసం.. మోసం!బడ్జెట్ మొత్తం మోసం.. మోసం!.ఐదు లక్షల విద్య భరోసా కార్డుకు బడ్జెట్ కేటాయించలేదు. ఎస్సీ ఎస్టీ విద్యార్థులకు రావాల్సిన స్కాలర్షిప్ల గురించి బడ్జెట్లో ప్రస్తావన లేదు. ఇది విద్యార్థులను నిరుద్యోగులను మోసం చేసే మోసపూరితమైన బడ్జెట్ అని అన్నారు నిరుద్యోగులను నిట్ట నిలువ ముంచుతున్న రేవంత్ రెడ్డి సర్కార్ కి త్వరలోనే బుద్ధి చెప్పమని హెచ్చరిస్తూ డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో బండారి అభిషేక్, గోవిందు, రమేష్ తదితరులు పాల్గొన్నారు.


