
జనం న్యూస్ 21 మార్చి 2026 జిల్లా బ్యూరో ఇన్చార్జి జోగులాంబ గద్వాల్ జిల్లా విష్ణు వర్ధన్ గౌడ్ ;జోగుళాంబ గద్వాల జిల్లా అలంపూర్ నియోజకవర్గం తుమ్మిళ ఈ సారి బడ్జెట్ లో కూడా తుమ్మిళ్ల కు మొండి చేయి లేని జూరాల పాకాల – ప్రాజెక్టు కు గత పుస్కర కాలం 12సంవత్సరాలనుండి నిధులు బీజేపీ జోగులాంబ గద్వాల జిల్లా మాజీ అధ్యక్షులు .రామచంద్రారెడ్డి ద్వజం ఈరోజు అయిజ ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో వారు మాట్లాడుతూ నిన్న రాష్ట్ర బడ్జెట్ లో అలంపూర్ నియోజకవర్గం లో ఉన్న తుమ్మిళ్ల అనుసంధానం ఐన మల్లమ్మ కుంట రిజర్వాయర్ పేరు ప్రస్తావన లేదు నిధులు లేవని ఇప్పటికి రైతులు గత 8 సంవత్సరాల నుండి కేవలం తుంగభద్ర నది లో నీరు ఉంటే నే లిఫ్ట్ ద్వారా వస్తున్నాయి అని పంట చివరి దశ లో ఉన్నపుడు నది ఎండి పోయి పంటలకు నీరు రాక పలు మార్లు ఎండి పోవడం జరిగింది అని దేశం లోనే కాదు ప్రపంచంలో లో ఎక్కడ బ్యాలెన్స్సింగ్ రిజర్వాయర్ లేకుండా లిఫ్ట్ లు లేవు అని వారు అన్నారు అదేవిదంగా రాష్ట్ర లో జూరాల -పాకాల ప్రాజెక్టు లేనే లేదు అని కాని గత 12 సంవత్సరాలనుండి నిధులు ఇస్తున్నారు అని ఆ డబ్బులు ఎక్కడకు పోతున్నాయి అని అడిగారు వెంటనే తుమ్మిళ్ల ప్రాజెక్టు కు పూర్తిస్థాయి నిధులు ఇవ్వాలని డిమాండ్ చేశారు ఈ కార్యక్రమం లో బీజేపీ యస్ సి మోర్చా కార్యవర్గ సభ్యులు మాదన్న, నాయకులు లక్ష్మణ్ గౌడ్, నర్సింహా, రాజశేఖర్,భీమన్న, శ్రీకాంత్, వర్మ చారి తదితరులు పాలుగోన్నారు


