జనం న్యూస్ మార్చి 21 శాయంపేట మండలం రిపోర్టర్ మామిడి రవి శాయంపేట మండలం మారపేల్లి విజయ్ కుమార్ బీ ఎస్ ఎస్ హనుమకొండ జిల్లా ఉపాధ్యక్షులు. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి రాకముందు ప్రజా సంక్షేమం కోసం మేము ఇచ్చిన హామీలు అమలు చేస్తామని నమ్మబలికి గెలిచిన తర్వాత హామీలను నెరవేర్చకుండా కాలయాపన చేస్తూ మాటలతోనే పబ్బం గడుపుతుందని మారపేల్లి విజయ్ కుమార్ బహుజనసంక్షేమ సంఘం హనుమకొండ జిల్లా ఉపాధ్యక్షులు అన్నారు. ఈ సందర్భంగా విజయ్ కుమార్ మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి రాకముందు 6 గ్యారంటీలు ఇచ్చిందని అందులో ఒక ఫ్రీ బస్ తప్ప ఏ ఒక్క హామీ కూడా సక్రమంగా అమలు జరగడంలేదని వాపోయారు. 6 గ్యారంటీలలో రాజీవ్ యువ వికాసం, చేయూత, రైతు భరోసా ప్రతి పేద మహిళకు 2500 రూపాయలు, భూమిలేని మహిళలకు సంవత్సరాని కి 12 వేల రూపాయలు నిరుద్యోగ భృతి వంటి అనేక పథకాలు అమలు చేయకుండా కాలం గడుపుతున్నారని తెలిపారు. ప్రభుత్వం ఏర్పడి దాదాపుగా మూడు సంవత్సరాలు కావస్తున్నప్పటికీ ప్రజా సమస్యల పట్టించుకోక పోవడం సిగ్గుచేటని అన్నారు. నిరుద్యోగ యువకులకు ప్రతి సంవత్సరం జాబ్ క్యాలెండర్ రిలీజ్ చేస్తామని చెప్పి ఇప్పటివరకు కూడా జాబ్ క్యాలెండర్ రిలీజ్ చేయకుండా నిరుద్యోగులను మోసం చేశారని ఆవేదన చెందారు. గ్రామాలలో అభివృద్ధి కరువైందని ప్రతి గ్రామం కూడా సమస్యల తో కొట్టుమిట్టాడుతుందని అన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఇకనైనా మేల్కొని ఇచ్చిన హామీలన్నీ నెరవేర్చే విధంగా చొరవ తీసుకోవాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో బహుజన సంక్షేమ సంఘం మండల అధ్యక్షులు మారపేల్లి సుధాకర్ డాన్, ఎ రాజు. మల్లేష్, మొగిలి, తదితరులు పాల్గొన్నారు….


