జనం న్యూస్ మార్చ్ 21 అనకాపల్లి జిల్లా రిపోర్టర్ కృష్ణ ఉత్తరాంధ్ర ఇలవేల్పు రాష్ట్ర పండుగగా గుర్తింపు పొందిన అనకాపల్లి గవరపాలెం లో వెలిసిన శ్రీ నూకంబిక అమ్మవారి దేవస్థానంలో శనివారం పార్లమెంటు సభ్యులు సీఎం రమేష్, శ్రీదేవి దంపతుల వివాహ మహోత్సవం సందర్భంగా పార్లమెంట్ నియోజకవర్గ ఇన్చార్జ్ విజయ నాయుడు అమ్మవారిని దర్శించుకొని ప్రత్యేక పూజలు నిర్వహించారు, ఆయనకు అమ్మవారి ఫోటో ప్రసాదాన్ని అందజేసి ఘనంగా సత్కరించారు. పార్లమెంటు సభ్యులు సీఎం రమేష్, శ్రీదేవి దంపతుల వివాహ మహోత్సవ సందర్భంగా వారి ఆర్థిక సహకారంతో ఆలయ మండపంలో అన్నప్రసాదాన్ని విజయ నాయుడు ప్రారంభించారు.ఈ కార్యక్రమంలో ఆలయ చైర్మన్ పీలా నాగ శ్రీను, ఆలయ సహాయ కమిషనర్ యాళ్ల శ్రీధర్ , ఆలయ ధర్మకర్తలు సూరే సతీష్,దాడి రవికుమార్ పొలిమేర స్వాతి ఆనంద్, మారిశెట్టి శంకర్రావు,కాండ్రేగుల రాజారావు ,మజ్జి జానకి శ్రీనివాసరావు, కొడుకుల శ్రీకాంత్,వడ్డాది మంగ,కోనేటి సూర్యలక్ష్మి పైడిరాజు, యర్రవరపు సంతోషి కుమారినాగేషి, తదితరులు పాల్గొన్నారు.//


