Listen to this article

ముస్లిం సోదరులకు రంజాన్ శుభాకాంక్షలు తెలిపిన ఎమ్మెల్యే టి.రామ్మోహన్ రెడ్డి

జనం న్యూస్ 21 మార్చి వికారాబాద్ జిల్లా రంజాన్ పండుగ పర్వదినాన్ని పురస్కరించుకొని పరిగి పట్టణంలోని ఈద్గాలో జరిగిన రంజాన్ వేడుకల్లో పరిగి ఎమ్మెల్యే డాక్టర్ టి.రామ్మోహన్ రెడ్డి స్థానిక నాయకులు, ప్రజా ప్రతినిధుల తో కలిసి పాల్గొన్నారు. ఈ సందర్భంగా ముస్లీం సోదరులతో కలసి ప్రార్థనలు నిర్వహించిన పరిగి ఎమ్మెల్యే టి రామ్మోహన్ రెడ్డి వారిని ఆలింగనం చేసుకుంటూ “ఈద్ ముబారక్” అంటూ హృదయపూర్వక శుభాకాంక్షలు తెలిపారు.సమాజంలో సౌహార్దత,సోదరభావం పెంపొందాలని, అందరూ శాంతి సుఖాలతో జీవించాలని ఆకాంక్షించారు.ఈ కార్యక్రమంలో పలువురు ప్రజాప్రతినిధులు,నాయకులు, ముస్లీం సోదరులు పాల్గొన్నారు.