Listen to this article

జనంన్యూస్ ఫిబ్రవరి 14 2025 దౌల్తాబాద్ మండల వికారాబాద్ జిల్లా మండల కేంద్రంలోని గోక ఫసల్ వాద్ గ్రామ సమీపంలోని గుట్టపై వెలసిన శ్రీ తిరుమలేశ్వర స్వామి వార్షిక బ్రహ్మోత్సవాల సందర్భంగా వేదమంత్రాలతో స్వామివారికి అభిషేకము హోమము కళ్యాణోత్సవం అంగరంగ వైభవంగా జరిగింది విచ్చేసిన భక్తులు స్వామివారికి ప్రదర్శనలు చేసి మొక్కలు తీర్చుకున్నారు అనంతరం విచ్చేసిన భక్తులకు శ్రీ బనదేశ్వర ట్రేడర్స్ ఆవిటి సిద్ధేశ్వర్ దంపతులచే అన్నదాన కార్యక్రమం కొనసాగింది రాత్రికి 9:00 గంటలకు భజన కార్యక్రమం తెల్ల వారుజామున 2-00 గంటలకు స్వామివారి రథోత్సవ కార్యక్రమం కొనసాగుతుంది ఈ కార్యక్రమంలో గ్రామ మాజీ ఎంపీటీసీ అక్కిడి కేశవరెడ్డి ఆర్ రామకృష్ణారెడ్డి భీమ్ రెడ్డి సతీష్ ముదిరాజ్ ఎస్ అనంతయ్య బస్వరాజ్ ప్రభాకర్ రెడ్డి నరసింహారెడ్డి వెంకట్ రాములు చారి బుగ్గప్ప గ్రామ భక్తులు తదితరులు పాల్గొన్నారు