Listen to this article

నిరుద్యోగులను మోసం చేయడమే అజెండాగా చంద్రబాబు ప్రభుత్వం:

వైఎస్ఆర్సిపి యువ నాయకుడు పల్లె గ్రీష్మంత్ రెడ్డినిరుద్యోగ యువతకు ఉద్యోగాల పేరిట బూటకపు జాబ్ క్యాలెండర్ విడుదల చేసి కూటమి ప్రభుత్వం మరోసారి నిరుద్యోగులను మోసం చేసిందని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు పల్లె గ్రీష్మంత్ రెడ్డి* ఆరోపించారు. ఎన్నికల సమయంలో యువతకు 20 లక్షల ఉద్యోగాలు కల్పిస్తామని, అప్పటి వరకు నెలకు రూ 3,000 నిరుద్యోగ భృతి అందిస్తామని, వర్క్ ఫ్రం హోమ్ కోసం హైటెక్ టవర్లు నిర్మిస్తామని, పరిశ్రమలు తెచ్చి విస్తృతంగా ఉద్యోగ అవకాశాలు కల్పిస్తామని ఇచ్చిన హామీలు ఏమయ్యాయని ఆయన ప్రశ్నించారు??ఉగాది కానుకగా జాబ్ క్యాలెండర్ విడుదల చేశామంటూ యువతను ఊరించి, చివరకు అరకొర ఉద్యో గాలతో నిరాశకు గురి చేశారని ఆయన వాపోయారు..కూటమి ప్రభుత్వం ప్రకటిస్తున్న గణాంకాలపై చాలా సందేహాలు ఉన్నాయి, 20 నెలల్లో 6,28,347 ఉద్యోగాలు ఇచ్చామని, రూ.23 లక్షల కోట్ల పెట్టుబడులతో 25 లక్షల ఉద్యోగ అవకాశాలు కల్పించేందుకు ఒప్పందాలు చేసుకున్నామని చెబుతున్న ప్రభుత్వం, వాస్తవంగా రాష్ట్రానికి వచ్చిన కంపెనీలు ఎన్ని..?? వాటి ద్వారా ఎన్ని ఉద్యోగాలు కల్పించారో స్పష్టత ఇవ్వాలని ఆయన ప్రశ్నించారు నిరుద్యోగ యువతకు గత వైయస్సార్ కాంగ్రెసు పార్టీ ప్రభుత్వం అండగా నిలిచింది. మాజీ ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డి నాయకత్వంలో లక్షలాది ఉద్యోగాలు కల్పించి యువత భవిష్యత్తుకు బలమైన పునాది వేశాం…ఇప్పటికైనా కూటమి ప్రభుత్వం తన వైఖరిని మార్చుకుని, ఎన్నికల హామీల మేరకు యువతకు ఉద్యోగ అవకాశాలు కల్పించాలని డిమాండ్ చేస్తున్నాను,లేకపోతే నిరుద్యోగ యువతకు న్యాయం జరిగే వరకు వైసీపీ తరపున పోరాటం కొనసాగిస్తూనే ఉంటామని ఆయన హెచ్చరించారు.