Listen to this article

జనం న్యూస్ మార్చి 22 శాయంపేట మండలం రిపోర్టర్ మామిడి రవి

శాయంపేట మండల కేంద్రంలోని అతి పురాతనమైన ఆరు శతాబ్దాల చరిత్ర గలిగిన శ్రీ మత్స్యగిరి స్వామి దేవాలయంలో27 తేదీ శుక్రవారం సీతారాముల కళ్యాణాన్ని వైభవంగా నిర్వహించుటకు ఏర్పాట్లు చేస్తున్నట్లు దేవాలయ చైర్మన్ సామల బిక్షపతి తెలిపారు. సీతారాముల కళ్యాణ కరపత్రాలను దేవాలయ చైర్మన్ సామల బిక్షపతి అర్చకులు ఆరుట్ల కృష్ణమాచారి అడ్వకేట్ లెక్కల జలంధర్ రెడ్డి చింతల రవిపాల్ ఆదివారం కరపత్రాలను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా దేవాలయ చైర్మన్ సామల బిక్షపతి మాట్లాడుతూ ఉదయం 8 గంటలకు శ్రీ మత్స్యగిరి స్వామి దేవాలయం నుండి గ్రామంలో బైక్ ర్యాలీ ఉదయం 10 గంటలకు తలంబ్రాలను తీసుకొని రావడం ఉదయం 10:30 గంటలకు రామాయణంపై క్విజ్ కార్యక్రమం సౌమిత్రి లక్ష్మణ చారి ధార్మిక ఉపన్యాసం ఉదయం 11:30 విశ్వక్సేన ఆరాధన రక్షాబంధన్ పుణ్యావచనము మధ్యాహ్నం 12.05 నిమిషాలకు శ్రీ సీతా రాముల కళ్యాణం నిర్వహించడం జరుగుతుందని మధ్యాహ్నం 1.30 లెక్కల లక్ష్మీ జలంధర్ రెడ్డి దంపతులచే అన్నదాన కార్యక్రమం నిర్వహించడం జరుగుతుందని కావున భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని స్వామివారి తీర్థప్రసాదాలు స్వీకరించగలరని చైర్మన్ సామల బిక్షపతి తెలిపారు ఈ కార్యక్రమంలో గిద్దమారి సురేష్ కానుగుల నాగరాజు ఉప్పు రాజు ఎం నాగరాజు అనుకారి శివాజీ తదితరులు పాల్గొన్నారు……