Listen to this article

జనం న్యూస్ 23 మార్చి 2026 జిల్లా బ్యూరో ఇన్చార్జి జోగులాంబ గద్వాల్ జిల్లా విష్ణు వర్ధన్ గౌడ్

మూడు పంటల రైతుబంధు… ఒకటి ఇచ్చి రెండు ఎగవేతేనా?ఇప్పుడిచ్చేది ఏ పంటది? రాష్ట్రవ్యాప్తంగా రైతుల్లో గందరగోళం కేటి దొడ్డి మండల్ బిఆర్ఎస్ నాయకులు గాజుల కృష్ణ రెడ్డి జోగులాంబ గద్వాల జిల్లా 45 రోజుల ఆలస్యం వెనుక పక్క ప్రణాళికా? అనుమానాల వెల్లువ “ఇప్పుడే ఇచ్చాం” అంటూ వానాకాలం రైతుబంధు నిలిపివేతేనా? మాటలు మూడు సార్లు… అమల్లో ఒక్కసారి మాత్రమే సహాయమా?
రాష్ట్రంలో రైతుబంధు చెల్లింపులపై పెద్ద ఎత్తున గందరగోళం నెలకొంది. మూడు పంటలకు మద్దతు ఇస్తామని చెప్పిన హామీలు అమల్లో కనిపించకపోవడంతో రైతులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ముఖ్యంగా ప్రస్తుతం ప్రభుత్వం విడుదల చేస్తున్న నిధులు ఏ పంటకు సంబంధించినవో స్పష్టత లేకపోవడం రైతులను అయోమయంలోకి నెట్టేస్తోంది.గ్రామాల నుంచి మండలాల వరకు రైతులు ఒకటే ప్రశ్న వేస్తున్నారు —“ఇది యాసంగి పంట రైతుబంధునా? లేక వానాకాలం బకాయిలా?”వ్యవసాయ చక్రాన్ని పరిశీలిస్తే, యాసంగి పంటకు ఇవ్వాల్సిన సహాయం ఆలస్యంగా ఇప్పుడు అందుతున్నట్లు కనిపిస్తోంది. డిసెంబర్–జనవరిలో ఇవ్వాల్సిన డబ్బులు మార్చి–ఏప్రిల్ మధ్యలో రావడం వల్ల రైతులకు అసలు ప్రయోజనం తగ్గిపోతోందని వారు అంటున్నారు.ఇంకా ప్రభుత్వం చెప్పిన 45 రోజుల గడువు ప్రకారం చూస్తే, ఈ చెల్లింపులు ఏప్రిల్ మధ్య వరకు సాగుతాయి. ఆ తర్వాత మే నెలలో పంటలు ఉండవు. జూన్‌లో వానాకాలం ప్రారంభమవుతుంది. ఈ నేపథ్యంలో రైతుల్లో పెద్ద అనుమానం పెరుగుతోంది “ఇప్పుడే ఇచ్చాం కదా” అంటూ వానాకాలం రైతుబంధును తప్పించుకునే ప్రయత్నమా?”మరోవైపు మూడు పంటలకు రైతుబంధు ఇస్తామని చెప్పిన హామీలు ఇప్పుడు అమల్లో కనిపించకపోవడంతో రైతులు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు.
“మూడు పంటలు అన్న ప్రభుత్వం… ఒకటి ఇచ్చి రెండు ఎగవేస్తుందా?” అన్న విమర్శలు వినిపిస్తున్నాయి.
రైతుల ప్రధాన డిమాండ్లు స్పష్టంగా ఉన్నాయి: ఇప్పుడిచ్చే రైతుబంధు ఏ సీజన్‌ది చెప్పాలి వానాకాలం రైతుబంధు షెడ్యూల్ ప్రకటించాలి ఆలస్యానికి కారణాలు వెల్లడించాలి రైతు సంఘాలు హెచ్చరిస్తున్నాయి
“పంట సమయానికి డబ్బు రాకపోతే రైతుబంధు విలువే ఉండదు”ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో రైతులు అప్పులు చేసి పంటలు సాగు చేస్తున్నారని, ఆలస్యంగా వచ్చే సహాయం వల్ల ప్రయోజనం లేకపోతుందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. రైతుకు సమయానికి సహాయం అందితేనే పంట నిలుస్తుంది… లేకపోతే హామీలు కేవలం మాటలుగానే మిగిలిపోతాయి! పత్రికా ముఖంగా తెలిపారు ఈ కార్యక్రమంలో శివరాజ్ ,వీరేష్, వెంకటేష్ తదితరులు