Listen to this article

జనం న్యూస్ మార్చ్ 23 అనకాపల్లి జిల్లా రిపోర్టర్ కృష్ణ

తెలుగుదేశం పార్టీ రాష్ట్ర కార్యాలయం మంగళగిరి లో ఈరోజు 84 వ వార్డు కస్టర్ కమిటీలకు జీవీఎంసీ పరిధిలో రెండు రోజులు ట్రైనింగ్ ప్రోగ్రామ్ ను ఏర్పాటు చేశారని 84వ ఇంచార్జ్ కస్టర్ కమిటీ కన్వీనర్ మాదంశెట్టి నీలబాబు తెలియజేశారు. ముందుగా ఎన్టీఆర్ విగ్రహానికి ప్రోగ్రాం కమిటీ ఇంచార్జ్ శాసనమండలి సభ్యులు చిరంజీరావు పూలమాల వేసి ట్రైనింగ్ ప్రోగ్రామ్ కి వచ్చిన వారందరూ ఘనమైన నివాళులర్పించారు. అనంతరం కస్టర్ పరిధిలో ఉన్న బూత్ లు పర్యవేక్షణ బూత్ ఇన్చార్జిలతో తీసుకోవలసిన జాగ్రత్తలు ఎన్నికల్లో ఓటర్లతో ఏ విధంగా వ్యవహరించాలి, ప్రభుత్వ సంక్షేమ కార్యక్రమాలు, అభివృద్ధి కార్యక్రమాలు ప్రతి ఓటర్ కి వివరించాలని, ఫీడ్ బ్యాక్ తీసుకొని లోపాలను ఉంటే అక్కడ శాసనసభ్యులకు ఇన్చార్జీలకి తెలియజేసి సరిదిద్దే ప్రయత్నం చేయాలని ట్రైనింగ్ లో వివరించారని నీలబాబు తెలిపారు.