Listen to this article

జనం న్యూస్ మార్చి 23 తెలంగాణ స్టేట్ ఇంచార్జ్ శ్రీనివాస్ రెడ్డి

ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నాయకత్వంలో తెలంగాణ కాంగ్రెస్ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాలు రియల్ ఎస్టేట్ రంగాన్ని మరింత వేగంగా ముందుకు తీసుకెళ్తున్నాయి.375 గజాల వరకు జీ +6 అంతస్తులకుభవనాలకు అనుమతి ఇవ్వడం, 500 గజాల నివాస స్థలంలో రోడ్డు వెడల్పును అనుసరించి
40 ft రోడ్డుకి జీ +8,60 ft రోడ్డుకి జీ +9,80 ft రోడ్డుకి జీ +10 వరకు అంతస్తులకు అనుమతులు కల్పించడం నిర్మాణ రంగానికి గొప్ప ప్రోత్సాహం.టిడిఆర్ వినియోగాన్ని సులభతరం చేసి, భూ యజమానులు మరియు బిల్డర్లకు మరింత అవకాశాలు కల్పించింది ఇది కేవలం బిల్డర్లకే కాదు—సాధారణ ప్రజలకు కూడా ఒక గొప్ప అవకాశం. గృహ కొనుగోలు దారులకు తక్కువ ధరల్లో ఇళ్లు అందే అవకాశం పెరుగుతుంది. స్క్వేర్ ఫీట్ ధరలు నియంత్రణలోకి వచ్చే పరిస్థితులు కనిపిస్తున్నాయి. చిన్న మరియు మధ్య తరగతి కుటుంబాలకు ఇది ఒక ఆశాకిరణం.భూమి యజమానులకు కూడా ఈ నిర్ణయాలు పెద్ద ఊరటనిస్తున్నాయి. హైదరాబాద్ వంటి నగరాల్లో పెరుగుతున్న భూమి విలువలను దృష్టిలో ఉంచుకుని, తమ స్థలంలో అదనపు అంతస్తులు నిర్మించుకునే అవకాశం రావడం వారికి ఆర్థికంగా లాభదాయకం అవుతుంది.సెట్‌బ్యాక్‌లలో సడలింపులు ఇవ్వడం, టిడిఆర్ వినియోగాన్ని ప్రోత్సహించడం వంటి చర్యలు అభివృద్ధి కార్యక్రమాలకు మరింత వేగం తీసుకువస్తాయి. రోడ్ల విస్తరణ, ఫ్లైఓవర్ల నిర్మాణం వంటి మౌలిక వసతుల అభివృద్ధికి ఇది బలంగా తోడ్పడుతుంది. ప్రభుత్వం అవసరమైనప్పుడు భూ యజమానులకు టిడిఆర్‌లను ఇవ్వడం, వాటిని బిల్డర్లు సులభంగా కొనుగోలు చేయడం ద్వారా అభివృద్ధి పనులు వేగవంతం అవుతాయి.
రియల్ ఎస్టేట్ రంగం అభివృద్ధి చెందడం వల్ల రిజిస్ట్రేషన్లు పెరుగుతాయి, ప్రభుత్వ ఆదాయం కూడా పెరుగుతుంది. అదే సమయంలో ప్రజలకు తక్కువ ధరల్లో గృహాలు అందుబాటులోకి రావడం ఒక గొప్ప సామాజిక ప్రయోజనం.భవనాల అనుమతుల ప్రక్రియను వేగవంతం చేస్తూ ప్రభుత్వ కార్యాలయాలు కీలక పాత్ర పోషిస్తున్నాయి. గతంలో ఉన్న క్లిష్ట విధానాలను సరళీకృతం చేసి, అనుమతుల కోసం పడే సమయాన్ని తగ్గించడం ద్వారా నిర్మాణ రంగానికి ఊతం తీసుకొస్తున్నాయి. అలాగే, ఇప్పటికే ఉన్న భవనాలను ప్రస్తుత నిబంధనలకు అనుగుణంగా మార్పులు చేసుకునే విధంగా ప్రభుత్వం సానుకూల దృక్పథంతో నిర్ణయాలు తీసుకోవడం ఎంతో ప్రాముఖ్యంగా మారింది.ఇది నిజంగా ప్రజా సంక్షేమాన్ని దృష్టిలో ఉంచుకుని తీసుకున్న చారిత్రాత్మక నిర్ణయం.