నిట్ లో ర్యాంకు సాధించిన విద్యార్థికి ఆర్థిక చేయూత-బుసిరెడ్డి పాండురంగారెడ్డి
జనం న్యూస్ -మార్చి 23- నాగార్జునసాగర్-
నాగార్జునసాగర్ నియోజకవర్గ చలమారెడ్డి గూడెం కు చెందిన నాగెళ్ళ శ్రీనివాస్- లక్ష్మమ్మ ల కూతురు నాగెళ్ళ పవిత్ర ఇటీవల జరిగిన నీట్ పరీక్షలలో ఉత్తమ ర్యాంకు సాధించి రాజన్న సిరిసిల్ల జిల్లా గవర్నమెంట్ మెడికల్ కాలేజీలో సీటు పొందిన విషయం తెలుసుకున్న బుసిరెడ్డి ఫౌండేషన్ చైర్మన్ బుసిరెడ్డి పాండురంగారెడ్డి నాగెళ్ళ పవిత్రను అభినందించి పై చదువుల నిమిత్తం ఆర్థిక సహాయం అందజేశారు. ఈ కార్యక్రమంలో వారి వెంట జానపాటి కోటేష్ యాదవ్, చామల రవీందర్ రెడ్డి, పవన్ మరియు బుసిరెడ్డి ఫౌండేషన్ సభ్యులు గ్రామస్తులు పాల్గొన్నారు.


