Listen to this article

జనం న్యూస్ మార్చ్ 23 వికారాబాద్ జిల్లా పరిగి నియోజకవర్గము,

2016 సంవత్సరం లో పరిగి పోలీస్ స్టేషన్ పరిధిలోని కేసులో నిందితుడికి కోర్టు పదేళ్ల కారాగార శిక్ష , 12000 రూపాయల విధిస్తూ తీర్పునిచ్చిందని జిల్లా ఎస్పీ శ్రీమతి స్నేహ మెహ్రా, ఐపీఎస్ గారు ఈ రోజు ఒక ప్రకటనలో తెలిపారు. పరిగి మండలం, బర్కత్‌పల్లి గ్రామానికి చెందిన సుక్కాని అంజయ్య (37) అనే వ్యక్తిపై 2016లో అత్యాచారం మరియు బెదిరింపులకు (IPC సెక్షన్లు 376, 506) సంబంధించి కేసు (Cr No: 268/2016) నమోదైంది. ఈ కేసు విచారణ వికారాబాద్‌లోని మొదటి అదనపు జిల్లా మరియు సెషన్స్ కోర్టులో కొనసాగింది. పోలీసులు సమర్పించిన పక్కా సాక్ష్యాధారాలను పరిశీలించిన గౌరవనీయ న్యాయమూర్తి శ్రీ చౌదరి చంద్ర కిషోర్ గారు, నిందితుడు అంజయ్య దోషిగా నిర్ధారిస్తూ 10 సంవత్సరాల జైలు శిక్ష మరియు 12,000 రూపాయల జరిమానా విధిస్తూ తీర్పు వెలువరించారు. ఈ కేసులో నిందితుడికి శిక్ష పడేలా చేయడంలో విశేష కృషి చేసిన అధికారులను ఎస్పీ గారు ప్రత్యేకంగా అభినందించారు. నాటి దర్యాప్తు అధికారులు వై. నాగేష్ (అప్పటి పరిగి SI), పి. ప్రసాద్ (అప్పటి పరిగి సి‌ఐ ), ప్రస్తుత పరిగి సీఐ శ్రీనివాస్ రెడ్డి, ఎస్.హెచ్.ఓ మోహన్ కృష్ణలను , అలాగే కోర్టులో సమర్థవంతంగా వాదనలు వినిపించిన అడిషనల్ పి.పి. శ్రీమతి మెరాజ్ ఫిర్దౌస్, సి.డి.ఓ జగన్ మోహన్ రెడ్డి, మరియు కోర్టు లైజన్ ఆఫీసర్ ఎస్. నిరంజన్ గౌడ్ ల పనితీరును ఎస్పీ గారు ప్రశంసించారు. మహిళల భద్రత విషయంలో జిల్లా పోలీస్ శాఖ అత్యంత కఠినంగా వ్యవహరిస్తుందని, నేరస్థులు చట్టం నుండి తప్పించుకోలేరని ఈ సందర్భంగా ఎస్పీ హెచ్చరించారు.