జనం న్యూస్ మార్చ్ 23, వికారాబాద్ జిల్లా పరిగి నియోజకవర్గం.
ప్రజా తీర్పుతోనే మేము సర్పంచుల అయినము :- పరిగి మండల BRS పార్టీ సర్పంచులు.నేడు పరిగి మాజీ ఎమ్మెల్యే కొప్పుల మహేష్ రెడ్డి గారి నివాసంలో ,BRS పార్టీ సర్పంచులు పత్రిక విలేకరులతో సమావేశం నిర్వహించారు.BRS పార్టీకి చెందిన సర్పంచుల మీద స్థానిక MLA వివక్షత చూపిస్తున్నారు అని తెలిపారు, కేంద్రం నుంచి వచ్చే NRGS నిధులను కూడా రాకుండా గ్రామాల అభివృద్ధికి అడ్డుగా స్థానిక MLA నిలుస్తున్నారు అని, BRS పార్టీ సర్పంచులు తెలిపారు.పరిగి మండలముని వివిధ గ్రామాల సర్పంచులు మందాకిని రంగాపూర్, కృష్ణయ్య తొండపల్లి,మాణిక్యం మిట్ట కోడూరు,రాములు మాదారం,యాదయ్య కుదాన్పూర్,కృష్ణ రాపోల్,రాజు చిట్యాల,మంజుల బసిరెడ్డిపల్లి, మంజుల రూపంపేట్, బ్రమరాంబ బర్కత్ పల్లి, స్రవంతి రాగాపూర్, సర్పంచులు పాల్గొన్నారు మా గ్రామాల అభివృద్ధికి సహకరించకుంటే MLA నీ గ్రామాల్లోకి రానివ్వడం అని ,పెద్ద ఎత్తున్న ధర్నాకు దిగుతామని స్థానిక MLA కి ఏచ్చరించిన BRS పార్టీ సర్పంచులు.


