జనం న్యూస్, 23 మార్చి, ఝరాసంగం మండలం, సంగారెడ్డి జిల్లా. ( జహీరాబాద్ నియోజకవర్గం ప్రతినిధి, చింతలగట్టు నర్సిములు )
సంగారెడ్డి జిల్లా, జహీరాబాద్ నియోజకవర్గంలోని, ఝరాసంగం మండల కేంద్రంలో, ప్రసిద్ధిగాంచిన పుణ్యక్షేత్రం, కేతకి సంగమేశ్వర స్వామి దేవాలయంలో, భక్తులు సమర్పించిన కానుకలను, అధికారులు హుండీని విప్పి లెక్కించారు. 46 రోజులకు స్వామి వారి ఆదాయం, రూపాయలు 24 లక్షల, 38 వెయ్యిల, 870 రూపాయలను, భక్తులు స్వామి వారికి, కానుకలుగా సమర్పించుకున్న ట్లు, అధికారులు తెలిపారు.
ఈ హుండీ లెక్కింపు కార్యక్రమానికి, పర్యవేక్షకులుగా, శశిధర్, పర్యవేక్షించారు. ఈ కార్యక్రమంలో, ఆలయ కమిటీ చైర్మన్ చంద్రశేఖర్, ఈవో శివ రుద్రప్ప, ధర్మకర్తలు మల్లికార్జున్ పాటిల్, మల్ శెట్టి, నవాజ్ రెడ్డి, శివకుమార్, మల్లప్ప, లక్ష్మీ నరసింహులు, బసయ్య స్వామి, ఝరాసంగం, ఎస్సై క్రాంతి కుమార్ పాటిల్, మరియు నారాయణ, శ్రీ అభినందన పారకామని నరసింహ, శ్రీరామ సేవ సమితి సంగారెడ్డి, అర్చక బృందం, బ్యాంకు సిబ్బంది పాల్గొన్నారు.


