జనం న్యూస్ 24 మార్చి 2026 జిల్లా బ్యూరో ఇన్చార్జి జోగులాంబ గద్వాల్ జిల్లా విష్ణు వర్ధన్ గౌడ్
గన్ పార్క్ వద్ద గ్యాస్ సిలిండర్ల ప్లకార్డులతో నిరసన తెలిపిన బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు..అనంతరం ప్లకార్డులతో నిరసన తెలుపుతూ, నినాదాలు చేస్తూ బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు అసెంబ్లీకి ర్యాలీగా బయలుదేరారు.అటు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు గ్యాస్ సరఫరా అంశంపై ప్రజలకు నిజాలు చెప్పాలన్నారు. ఒకవైపు ప్రభుత్వాలు కొరత లేదని చెబుతూనే.. మరోవైపు హోటళ్లు, చిరు వ్యాపారులకు గ్యాస్ సరఫరాను నిలిపివేశారని ఆవేదన వ్యక్తం చేశారు. దీంతో సాధారణ ప్రజానీకంతో పాటు, చిరు వ్యాపారులు, హోటల్ వ్యాపారంపై ఆధారపడిన లక్షల మంది ప్రజల ఉపాధికి తీవ్ర విఘాతం కలిగిందన్నారు.ఇప్పటికైనా రాష్ట్ర ప్రభుత్వం తెలంగాణలో నెలకొన్న గ్యాస్ సరఫరా సంక్షోభంపై స్పందించి ప్రజలకు నిజాలు తెలియజేయాలని డిమాండ్ చేశారు. గ్యాస్ సరఫరాను పెంచేందుకు అందుబాటులో ఉన్న అన్ని మార్గాలను. ఉపయోగించుకోవాలని విజ్ఞప్తి చేశారు.


