Listen to this article

జనం న్యూస్ అందోల్ నియోజకవర్గం జోగిపేట్ 24/3/2026

జోగిపేట పట్టణంలో కొలువైన శ్రీ జోగినాథ స్వామి చారిత్రకమైన, ఆధ్యాత్మిక, ప్రాధాన్యత కలిగిన క్షేత్రము ఇక్కడ శివపార్వతులు పానవట్టం లేకుండా జోడి లింగాల రూపంలో దర్శనం ఇస్తారు. సుమారు 400 ఏండ్ల చరిత్ర ఉన్న ఈ ఆలయంలో శివలింగాలు దినదినాభివృద్ధి చెందుతున్నట్లు భక్తుల నమ్మకం ప్రతి ఉగాది తర్వాత 11 రోజులపాటు జరిగే జాతర రథోత్సవంలో ప్రధాన ఆకర్షణ స్వామి వారి రథం సుమారు 50 అడుగుల ఎత్తు 24 టన్నుల బరువు కలిగిన భారీ లోహంతో ఐదంతస్తులలో వివిధ ఆకృతుల ప్రాకారాలతో పాటు వరసగా నందీశ్వరుడు, గణపతి, దుర్గామాత, శివలింగము, జోగినాథ స్వామి, దివ్య సుందరీమణులు మరియు విద్యుత్ కాంతులతో అందరినీ ఆకర్షిస్తుంది. స్వామివారి రథోత్సవ భాగంగా 25న రథశిఖర స్థాపన 28 నా శ్రీ జోగినాథ స్వామి వారి రథోత్సవం, 30న అగ్నిగుండ ప్రవేశం, 31న శ్రీ శివపార్వతుల కళ్యాణోత్సవం, ఒకటవ తేదీ లంకా దహనం మరియు రెండో తేదీన మహా రుద్రాభిషేకం పూజలతో అంగరంగ వైభవముగా జరుపబడును. స్వామి వారి జాతర ఉత్సవాలను వీక్షించడానికి చుట్టుపక్కల నుండి వేలాది గా ప్రజలు జరుగుతుంది. ఈ కార్యక్రమాన్ని ఆలయ అర్చకులు మాడుపతి వీరభద్రయ్య స్వామి మరియు రథోత్సవ కమిటీ ట్రస్ట్ చైర్మన్ సభ్యులు, పురపాలక సంగం చైర్మన్ మరియు సభ్యులు, పట్టణ ప్రజలు మరియు భక్త బృందాలు తో