Listen to this article

జనం న్యూస్ 24 మార్చి 2026 జిల్లా బ్యూరో ఇన్చార్జి జోగులాంబ గద్వాల్ జిల్లా విష్ణు వర్ధన్ గౌడ్

బి ఆర్ యస్ వి రాష్ట్ర నాయకులు మరియు జోగులాంబ గద్వాల జిల్లా కోఆర్డినేటర్ కురువ పల్లయ్య.
ఈ సందర్భంగా బీఆర్ఎస్వి రాష్ట్ర నాయకులు కురువ పల్లయ్య మాట్లాడుతూ…గద్వాల జిల్లాలోని అతిపెద్ద మండలం ఐజ మండలం. ఈ మండల కేంద్రానికి దాదాపు 70 గ్రామాలు అనుబంధంగా ఉన్నాయి.ప్రజలు, విద్యార్థులు నిత్యం వస్తూ, పోతూ ఉంటారు. ఇక్కడ చాలా ఏళ్ల నుంచి కాలేజీ వసతి గృహాలు లేకపోవడం వల్ల చాలామంది విద్యార్థులు ప్రతి సంవత్సరం విద్యకు దూరమవుతున్నారు. అదేవిధంగా గ్రామాల నుంచి మండల కేంద్రంలోకి వచ్చి పోవాలంటే చాలా ఇబ్బంది పడుతున్నారు. అందులో రవాణా సౌకర్యాలు కూడా సరిగా లేదు కాబట్టి విద్యార్థులు విద్య దూరమవుతున్న సందర్భంగా కచ్చితంగా మంజూరు చేయాలని జిల్లా కలెక్టర్ కి తెలిపారు. గతంలో కూడా పోయిన కలెక్టర్ల కి చాలాసార్లు విన్నవించాము అయినా సమస్య తీరడం లేదు అని వాపోయారు.