

మాచర్ల, ఫిబ్రవరి 12,( జనం న్యూస్) :- మాచర్ల పురపాలక సంఘ పరిధిలో జరుగుతున్న పారిశుద్ధ్య పనులను మునిసిపల్ కమిషనర్ వేణుబాబు బుధవారం పరిశీలించారు. పురపాలక సంఘ పరిధిలో పరిసరాలను పరిశుభ్రంగా ఉంచాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరి పైన ఉందని మున్సిపల్ కమిషనర్ అన్నారు. పురపాలక సిబ్బంది తడి,పొడి చెత్తను వేరువేరుగా సేకరించడం జరుగుతుందని తెలిపారు. స్వచ్ఛ మాచర్లకు ప్రతి ఒక్కరూ సహకరించాలని ఆయన అన్నారు. ఏమన్నా సమస్యలు ఉంటే ఆ దృష్టికి తీసుకురావాలని తెలిపారు