Listen to this article

జనం న్యూస్ నందలూరు కడప జిల్లా.

నందలూరు మండలంలోని తాసిల్దార్ కార్యాలయం నందు మంగళవారం స్థానిక కాకతీయ విలేఖరి డి రామకృష్ణ ఆధ్వర్యంలో తాసిల్దార్ ఏ, శివలక్ష్మి చేతుల మీదుగా కాకతీయ డైరీ ని ఆవిష్కరింప చేశారు ,ఈ సందర్భంగా ఆమె మాట్లా డుతూ ఈ డైరీ అధికారులకు ఉద్యోగులకు ఎంతోఉపయోగ కరంగా ఉందని ఆంధ్రప్రదేశ్ మంత్రుల ఫోన్ నెంబర్లు కూడా ఈ డైరీలో పొందుపరి చారని ప్రభుత్వ సెలవు దినాలు తదితర ముఖ్యమైన సమాచారం ఈ డైరీలో ఉందని ఆమె తెలిపారు, ఈ కార్యక్రమంలో డిప్యూటీ తాసిల్దార్ మోహన్ కృష్ణ, రెవెన్యూ ఇన్స్పెక్టర్ సుశీల్ కుమార్, పాత్రికేయులు జయసింహ, డేవిడ్ కళ్యాణ్ రాజ్ లు పాల్గొన్నారు