Listen to this article

జనం న్యూస్ పల్నాడు జిల్లా ఇంచార్జ్ సలికినీడి నాగు మార్చ్ 24 సెల్ 9550978955

కూటమి ప్రభుత్వం ఎన్నికల హామీలను అమలు చేయాలి.

తహసిల్దార్ కార్యాలయం ఎదుట ఆందోళన

సిపిఐ ఏరియా కార్యదర్శి తాళ్లూరి బాబురావు,నాయకులు సుభాని, నిర్మల, ధనరాజ్

భారత కమ్యూనిస్టు పార్టీ సిపిఐ చిలకలూరిపేట ఏరియా సమితి ఆధ్వర్యంలో మండల తహశీల్దార్ కార్యాలయం వద్ద ఆందోళన కార్యక్రమంలో నిర్వహించి డిప్యూటీ తహశీల్దార్ కు వినతి పత్రం అందించారు.ఈ సందర్భంగా జరిగిన ఆందోళన కార్యక్రమంలో పాల్గొన్న సిపిఐ ఏరియా కార్యదర్శి తాళ్లూరి బాబురావు మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం ఎన్నికల్లో ఇచ్చిన ఏ ఒక్క హామీని నెరవేర్చకుండా రాష్ట్ర ప్రజలను మోసగించిందని ఆరోపించారు. సూపర్ 6 పథకాల అమలు పేరిట ఆర్భాటం చేస్తున్న కూటమి ప్రభుత్వం ఏ లబ్ధిదారునికి న్యాయం చేసిందో చెప్పాలని డిమాండ్ చేశారు. రాష్ట్రంలో రెండున్నర ఏళ్ళుగా కొత్త రేషన్ కార్డులు,పెన్షన్లు ఇవ్వకుండా ప్రజలను ఇబ్బందులు పెడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. పట్టణాల్లో రెండు సెంట్లు ఇంటి స్థలం గ్రామాల్లో మూడు సెంట్లు ఇంటి స్థలం ఇచ్చి ఇంటి నిర్మాణానికి ఐదు లక్షల రూపాయలు ఇవ్వాలని డిమాండ్ చేశారు. AIYF రాష్ట్ర ఆర్గనైజింగ్ కార్యదర్శి షేక్ సుభాని,సీపీఐ పట్టణ కార్యదర్శి చెరుకుపల్లి నిర్మల మాట్లాడుతూ ఎన్నికల సమయంలో రాష్ట్రవ్యాప్తంగా కూటమి ప్రభుత్వం ఇచ్చిన హామీలు అమలు చేయడం లేదని విమర్శించారు. కూటమి ప్రభుత్వం చర్యలు భూమిలేని నిరుపేదలకు సెంటు భూమి ఇవ్వకుండా, కార్పొరేట్ కంపెనీలకు దారాదత్తంగా ప్రభుత్వ భూములను 99 పైసలకే కట్టబెడుతున్నారని ఆరోపించారు. పేదలకు కూడు , గూడు సమకూర్చవలసిన బాధ్యత ప్రభుత్వాలదే అని అన్నారు. తక్షణమే ప్రభుత్వం పూనుకొని పేదలకు పట్టణాలలో 2సెంట్లు,పల్లెటూర్లలో 3 సెంట్లు స్థలం ఇచ్చి ఇల్లు కట్టుకోవడానికి 5 లక్షల ఆర్థిక సహాయం అందించాలని డిమాండు చేశారు. ఈ కార్యక్రమంలో సీపీఐ ఏరియా సహయ కార్యదర్శి బొంతా ధనరాజ్, యడ్లపాడు మండల సీపీఐ కార్యదర్శి దాసరి వరహాలు, వేలూరు గ్రామ సిపిఐ కార్యదర్శి ఏలికా శ్రీనివాసరావు,AIYF ఏరియా కార్యదర్శి కె మల్లికార్జున్,షేక్ నన్నే, బొంత నాసర్ నాగేశ్వరరావు, తదితరులు పాల్గొన్నారు.