జనం న్యూస్ ఖమ్మం జిల్లా ఏన్కూర్ మండలం రిపోర్టర్ ఠాగూర్ మార్చ్ 24 :
ఏన్కూరు మండలం తూతక లింగన్నపేట గ్రామానికి చెందిన విద్యార్థులు గురుకుల విద్యాలయాలలో ఐదో తరగతి ప్రవేశ పరీక్ష ఫలితాలలో తమ ప్రతిభను కనబరిచారు. టి.ఎల్ .పేట, అంబేద్కర్ నగర్ ప్రాథమిక పాఠశాలకు చెందిన 11 మంది విద్యార్థులు పరీక్ష రాయగా 11 మంది విద్యార్థులు వివిధ గురుకుల విద్యాలయాలలో సీట్లు సాధించారు. ఏన్కూరు, వైరా (బాలికలు), వైరా (బాలురు) ,అన్నపురెడ్డిపల్లి గురుకుల విద్యాలయాలలో సీట్లు సాధించారు. వీరంతా టి.ఎల్. పేట గ్రామంలోని జుజ్జూరి కృష్ణమాచారి దగ్గర శిక్షణ పొందారు. ఎన్నో ఏళ్ల నుంచి ఈ గ్రామానికి చెందిన విద్యార్థులు అత్యధిక ఫలితాలు సాధిస్తూ జిల్లాలోనే మంచి గుర్తింపు తీసుకొచ్చారు. గత ఏడాది బాలికల విభాగంలో జిల్లా ప్రథమ స్థానం సాధించిన సంగతి తెలిసిందే .సీట్లు సాధించిన విద్యార్థులను ట్యూషన్ మాస్టర్ కృష్ణమాచారి (సీనియర్ రిపోర్టర్ )ని గ్రామస్తులు అభినందించారు.


