జనం న్యూస్ మార్చ్(24) సూర్యాపేట జిల్లా తుంగతుర్తి నియోజకవర్గం
అన్నారం గ్రామానికి చెందిన మాజీ ఎంపీటీసీ కుంచాల జనార్దన్ రెడ్డి మరణించడంతో వారి పార్థివదేహానికి మంగళవారం నాడు పూలమాలలువేసి నివాళులర్పించి వారి కుటుంబ సభ్యులను పరామర్శించిన తుంగతుర్తి మాజీ శాసనసభ్యులు గాదరి కిషోర్ కుమార్. అనంతరం వెలుగుపల్లి గ్రామానికి చెందిన బిఆర్ఎస్ నాయకులు కుమ్మరి వెంకన్న ఇటీవల మరణించడంతో వారి చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించి వారి కుటుంబ సభ్యులను పరామర్శించినాడు. ఈ కార్యక్రమంలో బిఆర్ఎస్ పార్టీ మండల అధ్యక్షుడు తాటికొండ సీతయ్య, కార్యకర్తలు,నాయకులు తదితరులు పాల్గొన్నారు


