Listen to this article

శ్రీ ఉమామహేశ్వర స్వామివార్ల కళ్యాణ , రథ, వసంతోత్సవ, తెప్పోత్సవముల ఆహ్వాన పత్రికలను ఆవిష్కరించిన బిసి రాజారెడ్డి..

జనం న్యూస్ నంద్యాల.. జిల్లా బనగానపల్లె.. టౌన్. రిపోర్టర్ డి మురళీకృష్ణ… జిల్లాలో ప్రముఖ శైవ క్షేత్రమైన యాగంటి లో జరిగే మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలకు బనగానపల్లె పట్టణ మాజీ సర్పంచ్ బిసి రాజారెడ్డిని ఆహ్వానించారు. ఆలయ ఈవో చంద్రుడు, యాగంటిపల్లె ఉపసర్పంచ్ మౌలిశ్వర్ రెడ్డి, ఆలయ అర్చకులు బుధవారం బిసి రాజారెడ్డిని కలిసి మహాశివరాత్రి సందర్భంగా యాగంటి క్షేత్రంలో జరిగే బ్రహ్మోత్సవాలకు హాజరుకావాలని ఆహ్వానించారు. ఈ సందర్భంగా బిసి రాజారెడ్డి చేతుల మీదుగా శ్రీ ఉమామహేశ్వర స్వామి వార్ల కళ్యాణ, రథ , వసంతోత్సవ, తెప్పోత్సవముల ఆహ్వాన పత్రికలను ఆవిష్కరించారు. అనంతరం బిసి రాజారెడ్డి మాట్లాడుతూ … మహాశివరాత్రి పర్వదినాన్ని పురస్కరించుకొని యాగంటి ఉమామహేశ్వర స్వామి వార్లను దర్శించుకునేందుకు వేలాదిమంది భక్తులు తరలి వస్తారని వారికి అవసరమైన అన్ని ఏర్పాట్లు చేయాలన్నారు. భక్తులు ఎటువంటి ఇబ్బందులు పడకుండా చూడాల్సిన బాధ్యత అధికారులపై ఉందన్నారు. స్వామివార్ల దర్శన కోసం వచ్చే భక్తుల కోసం ప్రత్యేక క్యూలైన్లు ఏర్పాటు చేసి త్వరితగతిన దర్శనం పూర్తి అయ్యేలా చూడాలన్నారు. వేసవికాలం దృష్ట్యా ఆలయ పరిసర ప్రాంతాల్లో చలువ పందులు ఏర్పాటు చేయాలని, తాగునీటి వసతి కల్పించాలని సూచించారు. ఏర్పాట్లపై ఆయా శాఖల అధికారులతో సమన్వయం చేసుకుంటూ బ్రహ్మోత్సవాలను విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. గత నవంబర్ నెలలో జరిగిన కార్తీక మాసం ఉత్సవాలను ఘనంగా నిర్వహించారని వారిని అభినందించారు. అంతే ధీటుగా శివరాత్రి బ్రహ్మోత్సవాలను కూడా విజయవంతం చేయాలని సూచించారు…