కమలా నెహ్రూ ఏరియా ఆసుపత్రిలో 29 మంది ఎస్పీఎఫ్ పోలీసుల రక్తదానం
జనం న్యూస్- మార్చి 24- నాగార్జునసాగర్ టౌన్-
తెలంగాణ ప్రభుత్వం చేపట్టిన ప్రజాపాలన- ప్రగతి ప్రణాళిక 99 రోజుల కార్యచరణలో భాగంగా నాగార్జునసాగర్ కమలా నెహ్రూ ఏరియా ఆసుపత్రిలో తెలంగాణ స్పెషల్ ప్రొటెక్షన్ ఫోర్స్ ( ఎస్ పి ఎఫ్) ఆధ్వర్యంలో రక్తదాన కార్యక్రమం నిర్వహించారు. ఈ రక్తదాన శిబిరంలో 29 మంది ఎస్పీఎఫ్ పోలీసులు రక్తదానం చేశారు, రక్తదానం చేసిన పోలీసులకు మహారాజుల సేవా సంఘం సభ్యులు పండ్లు బిస్కెట్స్ పంపిణీ చేశారు.ఈ సందర్భంగా అసిస్టెంట్ కమాండెంట్ డివి భాస్కరరావు మాట్లాడుతూ రక్తదానం ఒక మహోన్నతమైన సేవ అని ఇది ప్రాణాలను రక్షించడంలో కీలక పాత్ర పోషిస్తుందని ఒక యూనిట్ రక్తం ముగ్గురి ప్రాణాలను కాపాడటంలో సహాయపడుతుందని అన్నారు, ఇది గుండె జబ్బుల ప్రమాదం నుంచి రక్షిస్తుందని ఐరన్ స్థాయిలను క్రమబద్ధీకరించడం మరియు కొత్త రక్త కణాలు ఉత్పత్తికి ఉపయోగపడుతుంది అని అన్నారు, డ్యాం ఆర్ ఐ జి శ్రీనివాసరావు మాట్లాడుతూ అత్యవసర సమయాల్లో ప్రమాదాలు జరిగినప్పుడు శస్త్ర చికిత్సల సమయంలో ఇది జీవనాధారం అని అన్నారు, కమల నెహ్రూ ఏరియా ఆసుపత్రి సీఎంఓ డాక్టర్ హరికృష్ణ మాట్లాడుతూ క్రమం తప్పకుండా రక్తదానం చేయడం ద్వారా ఆసుపత్రుల్లో రక్తం యొక్క నిలువ స్థిరంగా ఉండి అత్యవసర సమయాల్లో కొరత లేకుండా ఉంటుందని ఎంతో మంది ప్రాణాలు కాపాడే అవకాశం ఉంటుందని అన్నారు. రక్త దాతలకు పండ్లు బిస్కెట్స్ పంచిపెట్టిన మహారాజుల సేవా సంఘం సభ్యులకు ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. ఈ కార్యక్రమంలో ఎస్పీఎఫ్ కమాండెంట్ డివి భాస్కరరావు, డ్యామ్ ఇన్స్పెక్టర్ జి శ్రీనివాసరావు, జెన్కో ఇన్స్పెక్టర్ ఎన్ఎస్ ప్రతాప్ నాయుడు, కమలా నెహ్రూ ఆసుపత్రి సీఎమ్ఓ డాక్టర్ హరికృష్ణ, డాక్టర్ జయంత్ అభయానందన్, రక్త నిల్వకేంద్రం సిబ్బంది వీరబాబు, ఏ రాజు, దుర్గయ్య, మహారాజుల సేవా సంఘం సభ్యులు నకులరావు, బద్రి, శివ ,సతీష్ లు పాల్గొన్నారు.


