జనం న్యూస్: మర్చి 24 నిడమనూరు నల్లగొండ ప్రతినిధి బొంగరాల శ్రీనివాస్
నిడమనూర్ మండల పరిదిలో మైనర్ పిల్లల డ్రైవింగ్ పైన స్పెషల్ డ్రైవ్ నిర్వహించి బైక్ లను నడుపుతున్న 10 మంది మైనర్ బాలురను పట్టుబడిచేయగా. హాలియా సర్కిల్ ఇంస్పెక్టర్ డి .సతీష్ రెడ్డి మరియు నిడమనూర్ సబ్ ఇన్స్పెక్టర్ యూ. సురేష్ లు వారి తల్లి తండ్రులకు కౌన్సిల్లింగ్ యిచ్చినారు. సర్కిల్ ఇంస్పెక్టర్ డి .సతీష్ రెడ్డి మాట్లాడుతూ మైనర్లు డ్రైవింగ్ చేస్తే వాహనం పై చాలాన్లు వేయడం జరుగుతుందని మరియు మైనర్ పిల్లలు వాహనాలు నడిపితే వారి తల్లిదండ్రుల పైన చట్ట పరమైన చర్యలు వుంటాయని కనుక పిల్లలకు మోటార్ సైకిల్ చేతి ఇవ్వకుండా జాగ్రత్త పడాలని తెలిపారు.


