Listen to this article

జనం న్యూస్ 26 మార్చి వికారాబాద్ జిల్లా

వికారాబాద్ జిల్లా పోలీస్ కార్యాలయంలో జిల్లా ఎస్పీ స్నేహ మెహ్రా, IPS జిల్లా పోలీస్ అధికారులతో సమీక్షా సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లాలో శాంతిభద్రతల పరిస్థితి, పెండింగ్ కేసులు మరియు నేరాల నియంత్రణపై ఎస్పీ సుదీర్ఘంగా సమీక్షించారు. సమావేశంలో భాగంగా జిల్లా వ్యాప్తంగా ఇప్పటివరకు నమోదైన కేసులు, పెండింగ్‌లో ఉన్న పాత కేసులు మరియు వాటి దర్యాప్తులో జాప్యానికి గల కారణాలను అధికారులకు ప్రశ్నించి దిశ నిర్దేశం చేసినారు. ముఖ్యంగా దొంగతనాల నియంత్రణకు, దొంగతనం కేసుల ఛేదనకు తీసుకుంటున్న చర్యలపై సమీక్షిస్తూ, నేరస్తులను పట్టుకోవడంలో సాంకేతిక తను ఉపయోగించి ‘డిటెక్టివ్’ నైపుణ్యాన్ని పెంచుకొని,కేసులను ఛేదించి, రికవరీ శాతాన్ని మెరుగుపరచి, బాధితులకు తమ సొత్తును అందించే విధంగా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. పోలీస్ స్టేషన్‌కు వచ్చే ఫిర్యాదుదారులతో అధికారులు మరియు సిబ్బంది అత్యంత మర్యాదగా ప్రవర్తించాలని ఎస్పీ చెప్పారు. ప్రతి ఫిర్యాదుపై తక్షణమే స్పందించి బాధితులకు న్యాయం చేయాలని, ప్రజల్లో పోలీసుల పట్ల నమ్మకాన్ని కలిగించేలా ‘విజిబుల్ పోలీసింగ్’ నిర్వహించాలని సూచించారు. ముఖ్యంగా మహిళలు మరియు బాలల భద్రతకు సంబంధించి పోక్సో (POCSO) మరియు SC/ST అట్రాసిటీ కేసుల్లో దర్యాప్తును వేగవంతం చేయాలని, నిందితుల అరెస్టుల విషయంలో అలసత్వం వహించకూడదని స్పష్టం చేశారు. అలాగే, పెండింగ్‌లో ఉన్న మిస్సింగ్ కేసులను సవాలుగా తీసుకుని త్వరగా ఛేదించాలని ఆదేశించారు. రహదారి భద్రతపై ప్రత్యేక దృష్టి సారించాలని ఎస్పీ అధికారులకు దిశానిర్దేశం చేశారు. ఇతర ప్రభుత్వ శాఖలతో సమన్వయం చేసుకుంటూ బ్లాక్ స్పాట్లను గుర్తించి, రోడ్డు ప్రమాదాలను తగ్గించేందుకు చర్యలు చేపట్టాలని కోరారు. డ్రంక్ అండ్ డ్రైవ్ (DD) తనిఖీలు మరియు ట్రాఫిక్ ఉల్లాంగాణ పైన స్పెషల్ డ్రైవ్ లు ఏర్పాటు చేయాలి. రోడ్డు ప్రమాదలపైనా మరిన్ని అవగాహన కార్యక్రమాలు ఏర్పాటు చేయాలి. అక్రమ రవాణాను అరికట్టేందుకు ఆకస్మిక తనిఖీలు నిర్వహించాలని తెలిపారు. నేరాల నియంత్రణలో సాంకేతికత వాడకం పెరగాలని, కొత్త సీసీటీవీ (CCTV) కెమెరాల ఏర్పాటుతో పాటు పాత వాటిని రిపేర్ చేయించి, వాటన్నింటినీ జియో ట్యాగింగ్ చేయాలని ఆదేశించారు. చివరగా, తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన 99 రోజుల ప్రత్యేక కార్యక్రమం ప్రజా పాలనా – ప్రగతి ప్రణాళిక లో ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలని ఎస్పీ పిలుపునిచ్చారు. ‘అరైవ్ – అలైవ్’ (Arrive-Alive) , డ్రగ్ నియంత్రణపైన అవగాహన కార్యక్రమాలు ద్వారా ప్రజలకు రోడ్డు భద్రత, డ్రగ్స్ నివారణ పై విస్తృత అవగాహన కల్పించాలని సూచించారు. లోక్ అదాలత్ ప్రాధాన్యతను కాక్షిదారులకు తెలియజేసి, కేసుల త్వరితగతిన పరిష్కారానికి కృషి చేయాలన్నారు. ఇట్టి కార్యక్రమం లో జిల్లా అదనపు ఎస్పీ బి. రాములు నాయక్, DCRB డీఎస్పీ జానయ్య, DTC డీఎస్పీ శ్రీనివాసులు, వికారాబాద్ డీఎస్పీ శ్రీనివాస్ రెడ్డి, పరిగి డీఎస్పీ శ్రీనివాస్, తాండూర్ డీఎస్పీ నర్సింగ్ యాదయ్య, ఏ ఆర్ డీఎస్పీ వీరేష్,సీఐ లు, ఎస్.ఐలు సిబ్బంది తదితరులు పాల్గొనడం జరిగింది.