జనం న్యూస్ ,-మార్చి 26- నాగార్జునసాగర్ టౌన్-
ప్రజా పాలన- ప్రగతి ప్రణాళిక 99 రోజుల కార్యచరణలో భాగంగా నాగార్జునసాగర్ నందికొండ మున్సిపాలిటీ కార్యాలయంలో అర్బన్ ఫ్యామిలీ హెల్త్ సెంటర్ ఆధ్వర్యంలో వైద్య శిబిరాన్ని నిర్వహించారు. నందికొండ మున్సిపల్ కమిషనర్ అశోక్ రెడ్డి, నందికొండ మున్సిపల్ చైర్ పర్సన్ స్వర్ణ మానస అధ్యక్షతన ఏర్పాటు చేసిన వైద్య శిబిరంలో నందికొండ మున్సిపాలిటీ కార్యాలయ సిబ్బందికి, పారిశుద్ధ్య కార్మికులకు వైద్య పరీక్షలు నిర్వహించారు. అర్బన్ ఫ్యామిలీ వెల్ఫేర్ సెంటర్ వైద్యాధికారి డాక్టర్ హరీష్ నేతృత్వంలో కార్మికులకు షుగర్, బీపీ వంటి వైద్య పరీక్షలు నిర్వహించి అవసరమైన వారికి మందులను అందజేశారు. ఈ కార్యక్రమంలో హెల్త్ సూపర్వైజర్ కమలమ్మ ,హెల్త్ అసిస్టెంట్లు గంగాబాయ్, లింగయ్య, తిరుమల చారి, నందికొండ మున్సిపాలిటీ కార్యాలయ సిబ్బంది రవికుమార్, సాయి, భరద్వాజ్, బాలాజీ, వార్డు ఆఫీసర్స్ తదితరులు పాల్గొన్నారు.


