Listen to this article

జనంన్యూస్. 26.నిజామాబాదు రురల్.శ్రీనివాస్ పటేల్.

ఉమ్మడి నిజామాబాదు జిల్లా కామారెడ్డి కేంద్రం లో 24 ,25 తేదీల్లో రెండు రోజులు జరిగాయని ఇట్టి మహాసభ లు ఉత్సాహం పూరితంగా ముగిసాయని .అఖిలభారత ప్రగతిశీల వ్యవసాయ కార్మిక సంఘం ఏఐపీకేఎంఎస్. రాష్ట్ర కార్యవర్గ సభ్యులు ఇ రమేష్ గురువారం నాడు విడుదల చేసిన ఒక పత్రిక ప్రకటన లో ఆయన తెలియజేసారు.రాష్ట్ర కార్యవర్గ సభ్యులుగా సిరికొండ వాసులు ముగ్గురికిచోటు.కామారెడ్డి జిల్లా కేంద్రంలో మార్చి 24 25 తేదీలలో జరిగినటువంటి అఖిలభారత ప్రగతిశీల వ్యవసాయ కార్మిక సంఘం (ఏఐపీకె ఎంఎస్ ) రాష్ట్ర రాష్ట్ర ప్రథమ మహాసభలో సిరికొండ వాసులకు ముగ్గురికి చోటు దక్కింది.సిరికొండ మండలం గడ్కోల్ గ్రామానికి చెందిన పి రామకృష్ణ రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా, అదే గ్రామానికి చెందిన బి కిషోర్ కార్యవర్గ సభ్యుడిగా, రావుట గ్రామానికి చెందిన ఈ రమేష్ కార్యవర్గ సభ్యుడిగా ఎంపిక అయ్యారని ఆయన తెలియజేసారు. వ్యవసాయ కార్మిక సంఘం ఏర్పడ్డప్పటినుంచి రాష్ట్రంలో జిల్లాలో మండలంలో సంఘం అభివృద్ధికి, వ్యవసాయ కూలీల కోసం బలమైన పోరాటాలు ఉద్యమాలు చేయడం వల్ల, క్రియాశీలకంగా వ్యవహరించడం వల్ల వీరికి రాష్ట్ర కమిటీ గుర్తించి ప్రధానమైన బాధ్యతలు అందించిందని ఆయన అన్నారు. పి రామకృష్ణ 30 ఏళ్లుగా క్రియాశీలకంగా పని చేస్తా ఉన్నారు. రాష్ట్రవ్యాప్తంగా జిల్లా వ్యాప్తంగా ఉద్యమాలు నిర్మిస్తూ తనదైనా శైలిలో పనిచేస్తురు అన్నారు.వీరు ముగ్గురు సహితం అనేక భూపోరాటాలు, ప్రజా సమస్యలపై ఉద్యమాలు నిర్మించారు. వీరు అంకితభావం తో సంఘం అభివృద్ధి కోసం పని చేయడం, వల్ల వీరు రాష్ట్ర నాయకత్వ స్థాయి లోకి ఎన్నుకుంనట్టు ఆయన పేర్కొన్నారు.