Listen to this article

జనం న్యూస్ మార్చు 26 తెలంగాణ స్టేట్ ఇంచార్జ్ శ్రీనివాస్ రెడ్డి

వరంగల్ పోలీస్ కమిషనర్ సన్ ప్రీత్ సింగ్, ఐపీఎస్ గురువారం సంగెం పోలీస్ స్టేషన్‌ను సందర్శించారు. ఈ సందర్భంగా పోలీస్ స్టేషన్‌కు చేరుకున్న కమిషనర్‌కు పోలీస్ అధికారులు పుష్పగుచ్ఛం అందజేసి స్వాగతం పలకగా, ముందుగా సీపీ పోలీస్ స్టేషన్ పరిసరాలను పరిశీలించి, స్టేషన్ ఆవరణలో మామిడి మొక్కను నాటారు.అనంతరం సీపీ పోలీస్ స్టేషన్‌ను సమగ్రంగా పరిశీలించిన కమిషనర్, స్టేషన్ పరిధిలోని గ్రామాలు, ప్రజల జీవన విధానం, స్థానికంగా జరుగుతున్న నేరాలు, రౌడీ షీటర్లు, అనుమానితులపై వివరాలను ఇన్స్‌పెక్టర్‌ను అడిగి తెలుసుకున్నారు. అలాగే పోలీస్ సిబ్బంది పనితీరు, బీట్ వ్యవస్థ, పెట్రోలింగ్, రికార్డుల నిర్వహణపై సమీక్ష నిర్వహించారు.అనంతరం స్టేషన్‌లో నమోదు అయిన కేసులు, పెండింగ్ కేసులు, నిందితుల అరెస్టుకు సంబంధించిన అంశాలపై రికార్డులను పరిశీలించారు.ఈ సందర్భంగా కమిషనర్ మాట్లాడుతూ, పోలీస్ స్టేషన్‌కు వచ్చే ప్రతి బాధితుడికి న్యాయం జరుగుతుందనే నమ్మకం కలిగేలా పనిచేయాలని సూచించారు. ఫిర్యాదులపై వెంటనే స్పందించాలని, విధి నిర్వహణలో అలసత్వం లేకుండా, పారదర్శకంగా సేవలు అందించాలని తెలిపారు. ప్రజల విశ్వాసం పొందే విధంగా పోలీసులు తమ విధులను నిర్వర్తించాలని ఆదేశించారు.ఈ కార్యక్రమంలో ఈస్ట్ జోన్ డీసీపీ అంకిత్ కుమార్, మామూనూర్ ఏసీపీ వెంకటేష్, పర్వతగిరి సిఐ రాజగోపాల్, సంగెం ఎస్. ఎస్. ఐ వంశీ కృష్ణతో పాటు సిబ్బంది పాల్గొన్నారు.