జనం న్యూస్ మార్చి 26 ముమ్మిడివరం ప్రతినిధి
డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా రావులపాలెంలో బీజేపీ జిల్లా అధ్యక్షులు అడబాల సత్యనారాయణ ఆద్వర్యంలో స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్(ఎస్. ఐ. ర్ )పై జిల్లా నాయకులకు, మండల అధ్యక్షులకు గురువారం అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో అనపర్తి ఎమ్మెల్యే, ఎస్. ఐ. ర్ రాష్ట్ర కన్వీనర్ నల్లమిల్లి రామకృష్ణారెడ్డి పాల్గొని మాట్లాడుతూ ఎస్. ఐ. ర్ గురించి వివరించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే రామకృష్ణారెడ్డి కి మాజీ శాసనసభ్యులు మానేపల్లి అయ్యాజీవేమ ముమ్మిడివరం మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ గోలకోటి వెంకట రెడ్డి, బీజేపీ జిల్లా ఉపాధ్యక్షులు గనిశెట్టి వెంకటేశ్వరరావు, జిల్లా ట్రెజరర్ గ్రంథి నానాజీ, అయినవిల్లి మండల అధ్యకులు యనమదల వెంకటరమణ ఘనంగా సత్కరించి , వివేకానంద బుక్ ను బహూకరించారు.



