

నియామక పత్రాన్ని అందించిన తెలంగాణ పి సి సి ప్రసిడెంట్ మహేష్ కుమార్ గౌడు పొన్నం అశోక్ గౌడు
ఫిబ్రవరి 12 జనంన్యూస్ ములుగు జిల్లా వెంకటాపురం మండల ప్రతినిధి. బట్టా శ్రీనివాసరావు ములుగు జిల్లా
(నూగూరు )వెంకటాపురం మండలం జమీందారు వంశస్థులైన కిరణ్ కుమార్ వర్మ , ములుగు జిల్లా కాంగ్రెస్ పార్టీ లీగల్ సెల్, హ్యూమన్ రైట్స్, ఆర్.టి.ఐ చైర్మన్ గా బుధవారం నియమితు లయ్యారు. ఈయొక్క కార్య క్రమంలో మాజీ మంత్రివర్యులు స్తంభాన్ని చంద్రశేఖర్, భద్రాద్రికొత్తగూడెం డిసిసి అధ్యక్షులు, టీపీసీసీ ఉపాధ్యక్షులు,రాష్ట్ర ఫారెస్ట్ డెవలప్మెంట్ చైర్మన్, మాజీ ఎమ్మెల్యే పోదెం వీరయ్య వారి ఆశీస్సులతో ఏఐసీసీ లీగల్ సెల్ చైర్మన్ అభిషేక్ మనోజ్ సింగ్, , తెలంగాణ పిసిసి ప్రెసిడెంట్ మహేష్ కుమార్ గౌడ్ వారి ఆదేశాల మేరకు తెలంగాణ రాష్ట్ర లీగల్ సెల్ చైర్మన్ పొన్నం అశోక్ గౌడ్ వారి ఆధ్వర్యంలో నియామక పత్రాన్ని అందజేశారు.ఈయొక్క నియామకాన్ని హర్షిస్తూ భద్రాద్రి జిల్లా డిసిసి అధ్యక్షులు, రాష్ట్ర ఫారెస్ట్ డెవలప్మెంట్ చైర్మన్ మాజీ ఎమ్మెల్యే పోదెం వీరయ్య అభినందనలు తెలియజేశారు.ఈయొక్క కార్యక్రమంలో భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కి చెందిన పలువురు కాంగ్రెస్ నాయకులు ,ఎస్సీ సెల్ చైర్మన్ చింతిరియాల రవికుమార్, అడబాల వెంకటేశ్వరరావు, తంబళ్ల వెంకటేశ్వరరావు కొమనపల్లి ఆదినారాయణ, భద్రాచలం డివిజన్ ఎస్సీ సెల్ చైర్మన్ రావుల నాని, సీనియర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు చిట్టి మల్ల దేవ సహాయం మరియు భద్రాచలం, వెంకటాపురం కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు అభిమానులు తదితరులు పాల్గొన్నారు .