జనం న్యూస్ 27 మార్చి 2026 జిల్లా బ్యూరో ఇన్చార్జి జోగులాంబ గద్వాల్ జిల్లా విష్ణు వర్ధన్ గౌడ్
నిరుద్యోగులకు, విద్యార్థులకు ఇచ్చిన హామీల అమలుకై “పోరు దీక్ష పోస్టర్” ను ఆవిష్కరించిన అలంపూర్ మున్సిపాలిటీ చైర్మన్ పిండి జయరాములు. బీఆర్ఎస్ పార్టీ రాష్ట్ర నాయకులు నాగర్ దొడ్డి వెంకట్రాములు
బీఆర్ఎస్వి రాష్ట్ర నాయకులు మరియు జోగులాంబ గద్వాల జిల్లా కోఆర్డినేటర్ కురువ పల్లయ్య పోరు దీక్షను విజయవంతం చేద్దాం. ఈ నెల మార్చి 30న (సోమవారం) నాడు గద్వాల జిల్లా కేంద్రంలోని పాతబస్టాండ్ వైయస్సార్ చౌక్ నందు బి ఆర్ యస్ వి ఆధ్వర్యంలో జరిగే నిరుద్యోగుల,విద్యార్థుల పోరు దీక్ష జోగులాంబ గద్వాల జిల్లా కేంద్రం పాతబస్టాండ్ వైఎస్ఆర్ చౌక్ నందు నిర్వహించే కార్యక్రమంనకు సంబంధించి బీఆర్ఎస్వి జిల్లా కోఆర్డినేటర్ కురువ పల్లయ్య ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన పోరు దీక్ష పోస్టర్ ఆవిష్కరణను అలంపూర్ మున్సిపాలిటీలోని హరిత హోటల్ లో ఆవిష్కరించారు ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ..తక్షణమే పెండింగ్లో ఉన్న ఫీజు రియంబర్స్మెంట్ బకాయిలు 10000 వేల కోట్లును విడుదల చేయకుండా మోసం. సంవత్సరంలోపు రెండు లక్షల ఉద్యోగాలు భర్తీ చేస్తా అని మోసం..ఫీజు రియంబర్స్మెంట్ విడుదల చేయకుండా మోసం..జాబ్ క్యాలెండర్ మోసం..విద్యా రంగానికి 15% బడ్జెట్ కేటాయిస్తాం అని మోసం..ప్రతి విద్యార్థికి ఐదు లక్షల విద్యాభరోసా కార్డు అమలు కాలేదు.గురుకులాలలో మౌలిక సదుపాయాలు కల్పించకుండగా, కలుషిత ఆహారం తినడం వలన రాష్ట్రంలో ఇప్పటికి 126 మంది విద్యార్థులు చనిపోవడం జరిగింది ఈ మరణాలకు బాధ్యత రేవంత్ రెడ్డి సర్కార్ దే.ఎస్సి, ఎస్టి విద్యార్థులు 10 వ తరగతి పాస్ అయితే 10000, ఇంటర్ పాస్ అయితే పదిహేను వేలు, డిగ్రీ పాసైతే 25000, పిజి పాస్ అయితే లక్ష, పిహెచ్డి పాస్ అయితే ఐదు లక్షలు ఇస్తా మోసం. 6 గ్యారంటీ లకు పంగనామాలు పెట్టిన నయవంచన 420 రేవంత్ రెడ్డి సర్కార్.ఇచ్చిన హామీలు అమలు చేసే వరకు బి ఆర్ యస్ వి ఉద్యమం ఆగదు అని విద్యార్థుల పక్షాన నిరంతరం పోరాడుతూనే ఉంటాం అని హెచ్చరిస్తూ డిమాండ్ చేసారు.ఈ కార్యక్రమం లో మున్సిపల్ వైస్ చైర్మన్ విక్రమ్, మాజీ సింగల్ విండో చైర్మన్ మోహన్ రెడ్డి, మాజీ మున్సిపల్ వైస్ చైర్మన్ శేఖర్ రెడ్డి, పట్టణ అధ్యక్షుడు వెంకట రామయ్య శెట్టి, మైనారిటీ నాయకులు రుక్కు, ఖలీల్, షబ్బీర్, మహబూబ్, విద్యార్థి విభాగం నాయకులు రాజేష్, రమేష్ నాయుడు, సుధాకర్ జగ్గుజీవన్, దివాకర్, వెంకటేశ్వర్లు పార్టీ నాయకులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.


